చెన్నారంలో మృత శిశువు లభ్యం

by Y.Nagarani |
చెన్నారంలో మృత శిశువు లభ్యం
X

దిశ, నేలకొండపల్లి: నేలకొండపల్లి మండల పరిధిలోని చెన్నారం గ్రామంలో మృత శిశువు లభ్యమైంది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో బట్టపోతుల విజయకుమార్ అనే వ్యక్తి ఇంటి పరిసర ప్రాంతంలో మృతి చెందిన మగ శిశువును వదిలి వెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న నేలకొండపల్లి పోలీసులు.. కేసు నమోదు చేశారు. శిశువు చనిపోయిన తర్వాత వారి ఇంటి దగ్గర పడేసి వెళ్లిపోయారా? లేక శిశువు బ్రతికి ఉండగానే అక్కడ వదిలి వెళ్లిపోయారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇటీవల ఆసుపత్రిలో చేరిన గర్భిణీల వివరాలను ఆరా తీస్తున్నారు. మృత శిశువును పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed