- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.180 కోట్లతో రామాలయం అభివృద్ధి
దిశ, భద్రాచలం: భద్రాచలం దేవాలయాన్ని రూ.180 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. భద్రాచలంలో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే రూ. 180 కోట్ల వ్యయంతో దేవాలయం అభివృద్ధి ప్లాన్ తయారవ్వాగా అందులో రూ. 41 కోట్ల రూపాయలు దేవాలయం చుట్టూ ఉన్న 80 ఇల్లు తొలగించినట్లయితే వారికి నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేవాలయం చుట్టూ ఉన్న ఇల్లు తొలగింపు కార్యక్రమానికి ఆయా ఇంటి యజమానులతో మాట్లాడటానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
ఇంటి యజమానులతో కమిటీ సభ్యులు మాట్లాడి నష్ట పరిహారంతో పాటు వారికి భద్రాచలంలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా అందించడానికి అవసరమైన స్థలాల ఎంపిక కూడా కమిటీ ద్వారా చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం అంతా పూర్తి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ అభివృద్ధి పై స్పష్టమైన ప్రకటన చేసే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. దేవాలయం అభివృద్ధి పై జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు దేవదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.