- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యా శాఖనా.... మజాకా...
దిశ, వైరా : విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఆరోపణలపై సస్పెన్షన్ కు గురైన ప్రధానోపాధ్యాయుడికి 40 రోజులు గడవక ముందే తిరిగి పోస్టింగ్ ఇచ్చి విద్యాశాఖ అధికారులు తమ వక్రబుద్దిని చాటుకున్నారు. సస్పెన్షన్ కు గురైన మండలంలోనే తిరిగి సదరు ప్రధానోపాధ్యాయుడికి పోస్టింగ్ ఇవ్వడం విశేషం. అంతేకాకుండా సదరు ప్రధానోపాధ్యాయుడు సస్పెండ్ కు గురైన పాఠశాలకు కూతవేటు దూరంలో ఉన్న మరో పాఠశాలలో పోస్టింగ్ ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఈ పోస్టింగ్ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయనే విమర్శలు వినవస్తున్నాయి. వైరా మండలంలోని పాలడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గతంలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేసి సస్పెన్షన్ కు గురైన చావా శ్రీనివాసరావుకు విద్యాశాఖ అధికారులు ఆఘ మేఘాల మీద పోస్టింగ్ ఇవ్వడం తీవ్ర చచ్చనీయాంశమైంది.
పాలడుగు పాఠశాలలోని ముగ్గురు విద్యార్థినిల తల్లిదండ్రులు తమ కుమార్తెలను లైంగికంగా వేధిస్తున్నాడని ప్రధానోపాధ్యాయుడు చావా శ్రీనివాసరావు పై సెప్టెంబర్ చివరలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో పాఠశాలలో తీవ్ర స్థాయిలో తల్లిదండ్రులు ఆందోళన చేశారు. దీంతో చావా శ్రీనివాసరావుపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అనంతరం అక్టోబర్ 1వ తేదీన శ్రీనివాసరావును సస్పెన్షన్ చేస్తూ వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయనకు 40 రోజులు గడవకముందే విద్యాశాఖ అధికారులు పోస్టింగ్ ఇచ్చారు. అంతేకాకుండా గతంలో సదరు ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్ కు గురైన వైరా మండలంలోనే పోస్టింగ్ ఇవ్వటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాకుండా చావా శ్రీనివాసరావు సస్పెన్షన్ కు గురైన పాలడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా మరలా అతనికి పోస్టింగ్ ఇవ్వడం వెనక ఆంతర్యం ఏమిటో అధికారులకే తెలియాలి. ఈ వ్యవహారంలో విద్యాశాఖ అధికారులు లక్షలాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని బహిరంగంగానే విమర్శలు వినవస్తున్నాయి. నిబంధన ప్రకారం సస్పెన్షన్ కు గురైన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు తిరిగి అదే మండలంలో పోస్టింగ్ ఇవ్వకూడదు. అయితే ఆ నిబంధనలను ఆర్జేడీ అతిక్రమించి గతంలో సస్పెండ్‌కు గురైన పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరంలోని మరో పాఠశాలలో పోస్టింగ్ ఇవ్వడం విశేషం. ఇప్పటికైనా విద్యా శాఖ రాష్ట్ర కమిషనర్ ఈ వ్యవహారంపై స్పందించి పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాలని పాలడుగు గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.