ఖమ్మం నగరంలో కరెంట్ కష్టాలు.. ఎంతకు స్పందించని అధికారులు!

by Disha Web Desk 9 |
ఖమ్మం నగరంలో కరెంట్ కష్టాలు.. ఎంతకు స్పందించని అధికారులు!
X

దిశ, ఖమ్మం: రాత్రి అయిందంటే కరెంట్ కోతలు తప్పడం లేదు. విద్యుత్ సరఫరాలో అంతరాయాల లేక.. ఓవర్ లోడ్‌తో విద్యుత్ సరఫరాలో కోతలు అమలు చేస్తున్నారా అర్థం కానీ పరిస్థితి. మరోవైపు ఎండాకాలంలో ఎండలు పగలు అంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.‌. రాత్రి పూట విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో విద్యుత్ వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం నగరంలోని ఖిల్లా ప్రాంతంలో ఉన్న బాగ్ లో గత మూడు రోజులుగా రాత్రి పూట విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇలాంటి పరిస్థితి ఉందంటే మిగితా ప్రాంతాల్లో ఎలా ఉందో విద్యుత్ అధికారులకే తెలియాలి.

గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు

ఖమ్మం నగరంలోని ఖిల్లా ప్రాంతంలో ఉన్న బాగ్‌లో చాలా మంది రోజు వారి పనులు చేస్తుకుంటూ జీవనం సాగించే కుటుంబాలు చాలా ఉన్నాయి. వీరు పగలు అంత కష్టపడి పనులు చేసి రాత్రి వేళల్లో కరెంట్ లేకపోవడంతో రాత్రి రెండు గంటల వరకు చీకట్లో మగ్గుతున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో పట్టణ ప్రగతిలో విద్యుత్ ఆధునీకరణ పనులు ముమ్మరంగా జరిగిన ఖమ్మం నగరంలో ఇంకా విద్యుత్ సరఫరాలో చోటు చేసుకుంటున్నాయి. గతంలో జరిగిన పట్టణ ప్రగతిలో విద్యుత్ పనుల్లో అవినీతి జరిగిందని పలు ఆరోపణలు వచ్చిన అధికారులు వాటిపై దృష్టి సారించరేదు. ఖమ్మం నగరంలో 60 డివిజన్లలో ఎక్కడో ఒక చోట మాత్రం విద్యుత్ సరఫరాలో అంతరాయాలు చోటు చేస్తుకుంటున్న అధికారులు మాత్రం లోపాలు గుర్తించి మరమ్మతులు చేయలేకపోతున్నారు. ఖమ్మం ఖిల్లా లోని బాగ్ ప్రాంతంలో రాత్రి 10 గంటల నుంచి మధ్య రాత్రి 2 గంటల వరకు విద్యుత్ ఓవర్ లోడ్ తో అంతరాయాలు ఏర్పడుతున్నాయి.

ఫోన్లకు చేస్తే స్పందించని అధికారులు

విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే వినియోగదారులు అధికారులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం 60 డివిజన్లలో ఇదే పరిస్థితి నెలకొంది. పగలు వినియోగదారులు ఫోన్లో చేసే మీటింగ్ లో ఉన్నాము, లేకపోతే టెలికాన్ఫరెన్స్ అంటూ అధికారులు దాటవేస్తున్నారు. రాత్రిపూట సరఫరాలో ఆటంకాలు చోటు చేసుకుంటే వినిగదారులు ఎంత ఫోన్ చేసినా ఫోన్లకు స్పందించడం లేదని వినియోగదారులు అధికారులపై గుర్రుగా ఉన్నారు. ఖిల్లా బాగ్ లో రాత్రి కరెంట్ లేదని వినియోగదారులు అధికారులకు ఫోన్లు చేసిన స్పందించలేదని వినియోగదారులు బహిరంగంగా వాపోతున్నారు. ఇప్పటికైనా సీఎండి దృష్టి సారించి ఖమ్మం నగరంలో చోటుచేసుకుంటున్న విద్యుత్ అంతరాయాలకు అడ్డు కట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story