నెలసరి ఆగిపోయి 7 నెలలు అవుతోంది.. నాకేమైనా సమస్యలు వస్తాయా..?

by Bhoopathi Nagaiah |
నెలసరి ఆగిపోయి 7 నెలలు అవుతోంది.. నాకేమైనా సమస్యలు వస్తాయా..?
X

మేడమ్ నా వయసు 49 ఏళ్లు. నెలసరి(Periods) ఆగిపోయి 7 నెలలు అవుతోంది. దీనివల్ల నాకేమైనా సమస్యలు వస్తాయా ..? నా ఫ్రెండ్స్ నాలో చాలా భయలను, అపోహల్ని రేకెత్తిస్తున్నారు. పురుషులకు మెనోపాస్ (Menopause for men)దశ ఉంటుందా? క్లియర్ చేయండి. - వనజ, ఖమ్మం

మెనోపాస్ (Menopause) దశకు చేరుకున్న స్త్రీలు చాలా ఆకర్షణీయంగా, లావుగా తయారై దాంపత్య జీవితంలో ఆసక్తిని కోల్పోతారని మీ ఫ్రెండ్ చెప్పింది అంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. మెనోపాజ్ దశ పురుషులకు కూడా ఉంటుంది. దాన్ని ఆండ్రోపాస్ (Andropause) అంటారు. ఆ దశలో స్త్రీ పురుషులు ఇద్దరికీ హార్మోన్స్ అపసవ్యత ఉంటుంది. స్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ (Estrogen hormone) లోపం వలన యోని నాళం (vaginal canal) పొడిబారి, బాధాకరంగా ఉంటుంది కాబట్టి సెక్స్ (Sex) పట్ల విముఖత ఏర్పడుతుంది. దీనికోసం ఈస్ట్రోజెన్ జెల్ (Estrogen gel)లోకల్‌గా వాడుతూ HRT చికిత్సకోసం గైనకాలజిస్ట్‌(Gynecologist)ని సంప్రదించాలి. ఆహారంలో ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉండే సోయాబీన్స్ (Soybeans) తినాలి. ఈస్ట్రోజెన్ లోపం వల్ల కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. కాబట్టి రోజూ వాకింగ్(walking), యోగా (Yoga)చేస్తూ, కొవ్వు, చక్కెర పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. మానసికంగా వచ్చే డిప్రెషన్, కోపం, చిరాకు, ఉద్రేకం తగ్గడానికి రిలాక్సేషన్, ప్రాణాయామం, ధ్యానం సాధన చేయాలి. నైపుణ్యం ఉన్న కొత్త వ్యాపకాల్లోకి వెళ్ళిపోయి బిజీగా ఉండాలి. ఆండ్రోపాజ్(Andropause) చేరిన పురుషులు ఆండ్రాలజిస్ట్‌(Andrologist)ను కలిసి చికిత్స తీసుకుంటూ.. జీవన విధానాల్లో మార్పులు వచ్చే పనులు చేయాలి. భార్యాభర్తలు ఇద్దరూ.. ఈ ప్రత్యేకమైన స్థితుల్లో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ... సహాయ సహకారాలు అందించుకోవాలి.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Advertisement

Next Story