ప్రభుత్వాస్పత్రిలో కొరవడిన వసతులు.. రోగుల జేబులకు చిల్లు

by Y.Nagarani |
ప్రభుత్వాస్పత్రిలో కొరవడిన వసతులు.. రోగుల జేబులకు చిల్లు
X

దిశ, ఖమ్మం: ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో సిటీ స్కానింగ్ మిషన్ పని చేయకపోవడంతో రోగులకు కష్టాలు తప్పడం లేదు. స్కానింగ్ మెషిన్‌కు విద్యుత్ సప్లై లేకపోవడంతో గత రెండు రోజులుగా సేవలు నిలిచిపోయాయి. మిషన్‌కు బయట నుంచే వైరింగ్ ఏర్పాటు చేయగా.. ఆ వైరింగ్ విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి అనుసంధానం ఉంది. దీంతో ఎక్కడ ఆటంకం ఏర్పడుతున్నదో తెలియడం లేదు. ఈ ఆస్పత్రికి నిత్యం 1500 నుంచి 2000మంది రోగులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చే రోగులను వైద్యులు పరీక్షించి, అవసరం ఉంటే సిటీ స్కానింగ్ కోసం పంపిస్తారు. ప్రస్తుతం స్కానింగ్ మిషన్ పనిచేయకపోవడంతో రోగులు ప్రైవేట్ సెంటర్లకు ఆశ్రయించే పరిస్థితి నెలకొన్నది. ఇక ప్రైవేటుకు వెళ్తే రోగులు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక్కడ స్కానింగ్ మిషన్ చేయడం లేదంటూ సిబ్బంది బయట సెంటర్లకు పంపించి కమీషన్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ప్రభుత్వాస్పత్రిలో సిటీ స్కానింగ్ మిషన్ పని చేయకపోవడంతో రోగులకు కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో సీటీ స్కానింగ్ మెషిన్‌కు విద్యుత్ సప్లై లేకపోవడంతో గత రెండు రోజులుగా రోగులకు సేవలు నిలిచిపోయాయి. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో ప్రతిరోజు 1500నుంచి 2000మంది రోగులు వస్తుంటారు. ఆస్పత్రికి వచ్చే రోగులను వైద్యులు పరిస్థితిని గమనించి అవసరం ఉంటే సిటీ స్కాన్లకు ప్రిఫర్ చేస్తారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ పనిచేయకపోవడంతో రోగులు ప్రవేట్ స్కానింగ్ సెంటర్లకు ఆశ్రయించే పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ ఆస్పత్రిలో సిటీ స్కానింగ్‌కు బయట నుంచే వైరింగ్ ఏర్పాటు చేశారు. ఆ వైరింగ్ విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి అనుసంధానం ఉండటంతో ఎక్కడ ఆటంకాలు ఉన్నాయో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇదే ప్రభుత్వాస్పత్రిలో ఉన్న సబ్‌స్టేషన్ వద్ద మురుగు నీరు కొన్ని రోజులుగా ఉండటంతో సిటీ స్కానింగ్ వచ్చే వైరింగ్‌లో ఆటంకాలు ఎదురై ఉంటాయని సిటీ స్కానింగ్ సిబ్బంది చెప్తున్నారు. విద్యుత్ సరఫరా వస్తేనే మిషన్ అందుబాటులోకి వస్తుందని మిషన్ టెక్నీషియన్లు చెబుతున్నారు.

ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లే దిక్కు

ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు సిటీ స్కానింగ్ అవసరమంటే ప్రైవేట్ సిటీ స్కానింగ్ సెంటర్లకు వెళ్లే పరిస్థితి నెలకొంది. బయట సీటీ స్కానింగ్ వెళ్లాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసే రోగులు పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాస్పత్రిలో సిటీ స్కానింగ్ మిషన్ ఉండటంతో రోగులకు కొంత ఉపశమనం లభిస్తుందని రోగులు చెబుతున్నారు. సిటీ స్కానింగ్ మిషన్ పనిచేయకపోవడంతో సిబ్బంది బయట సెంటర్లకు పంపించి కమీషన్లు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అధికారులు దృష్టి సారించి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న సిటీ స్కానింగ్ మిషన్‌కు విద్యుత్ సరఫరా అందించి రోగులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed