తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ

by Gantepaka Srikanth |
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బందిపై దాడుల నియంత్రణకు స్టేట్ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకున్నది. అన్ని గవర్నమెంట్ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, వయలెన్స్ ప్రివెన్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలని డెసిషన్ తీసుకున్నది. దీనికి సంబంధించి హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఆదేశాలతో కమిటీల ఏర్పాటుకు హెల్త్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ హెల్త్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో జిల్లా, ఏరియా ఆస్పత్రులు, డైరెక్టర్ ఆఫ్​మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ హాస్పిటల్స్.. ఇలా అన్నింటిలోనూ ఈ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఇవి హాస్పిటల్స్ భద్రత పెంపుతో పాటు స్టాఫ్ సేఫ్టీలో క్రీయాశీలక పాత్ర పోషించనున్నాయి.

చైర్మన్‌గా మెడికల్ సూపరింటెండెంట్

కమిటీకి చైర్మన్/చైర్ పర్సన్‌గా మెడికల్ సూపరింటెండెంట్, కన్వీనర్‌గా ఆర్ఎంవో ఉండనున్నారు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్, నర్సింగ్ సూపరింటెండెంట్, బయో మెడికల్ ఇంజినీర్, సెక్యూరిటీ స్టాఫ్​ఇన్‌చార్జి, ఐఎంఏ మెంబర్, సీనియర్ డాక్టర్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్, సీనియర్ అలైడ్ హెల్త్ స్టాఫ్​నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. అయితే సెక్యూరిటీ, వయలెన్స్ ప్రివెంటివ్ కమిటీలు రెండు వేర్వేరుగా పని చేస్తాయి. ఈ రెండు కమిటీలకు చైర్మన్‌గా సూపరింటెండెంట్ ఒక్కరే వ్యవహరిస్తారు.

కమిటీ పని తీరు ఇలా..

ఈ కమిటీలు ప్రతి రోజూ ఆస్పత్రులను ఆడిట్ చేస్తాయి. మూడు షిఫ్టులలోని భద్రతపై ఆరా తీస్తాయి. ఆస్పత్రి బయట, వార్డులలోనూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తాయి. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల తరహాలోనే అటెండర్లు, పేషెంట్ రిలేటీవ్స్‌కు విజిటర్ పాస్ సిస్టం అమలు చేయనున్నారు. హాస్పిటల్‌కు వచ్చే పబ్లిక్ ఎంట్రీ, ఎగ్జిట్‌లో స్క్రీనింగ్, సీసీ కెమెరాలతో మానిటరింగ్ ఏర్పాటు చేస్తారు. డాక్టర్ల డ్యూటీ రూమ్స్, రెస్ట్ రూమ్స్ టాయిలెట్స్ వద్ద ఎక్స్‌ట్రా లైటింగ్ ఉండేలా చర్యలు తీసుకుంటారు. డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర హెల్త్ కేర్ స్టాఫ్​అందరికీ రక్షణ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఐపీహెచ్‌ఎస్ 2022 నామ్స్ ప్రకారం సేఫ్టీ మెజర్స్ పాటించనున్నారు. ఇక ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాల పనితీరును చెక్ చేస్తూనే వాటి సంఖ్య మరింత పెంచేలా చర్యలు తీసుకోనున్నారు.

ఆ కెమెరాలన్నీ స్థానిక పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేయనున్నారు. సీసీ పుటేజీ స్టోరేజ్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులో తీసుకురానున్నారు. ఎప్పటికప్పుడూ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్, ఫైర్ సేఫ్టీ, మెడికల్ ఎక్విప్‌మెంట్, సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌పై రివ్యూ చేయాల్సి ఉంటుంది. చట్టాలపై అవగాహన కల్పించనున్నారు. హాస్పిటల్ సేఫ్టీ కోసం సెక్యూరిటీ స్టాఫ్‌కు డ్రిల్, ట్రైనింగ్ ఇవ్వాలి. మెడికల్, నర్సింగ్, అలైడ్ హెల్త్ స్టాఫ్​నుంచి నిత్యం ఫీడ్ బ్యాక్ తీసుకొని రివ్యూ మీటింగ్స్ పెట్టాలి. ఆ రిపోర్టును హాస్పిటల్ డెవలప్‌మెంట్ చైర్మన్‌కు సబ్‌మిట్ చేయాలి. 24 గంటల కంట్రోల్ రూమ్‌తో పాటు బారికేడ్ల విధానాన్నీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

Advertisement

Next Story

Most Viewed