మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడం మంచిది కాదు.. కేటీఆర్‌కు సొంత నేత గుత్తా చురకలు

by Gantepaka Srikanth |
మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడం మంచిది కాదు.. కేటీఆర్‌కు సొంత నేత గుత్తా చురకలు
X

దిశ, వెబ్‌డెస్క్: మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడం మంచిది కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంతటి గొప్ప పని చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందించాలని అన్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా విమర్శించాలి.. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా అభినందించాలని తెలిపారు. మూసీ ప్రక్షాళన విషయంలో తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని కేటీఆర్(KTR) మానుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా కూడా బాగుపడాలంటే మూసీ ప్రక్షాళన జరిగి తీరాలని అన్నారు. మూసీ కాలుష్యం మొత్తం నల్లగొండకే వస్తోందని ఆవేదన చెందారు.

గతంలో కేసీఆర్ కూడా మూసీ ప్రక్షాళనకు బోర్డు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. చెరువుల పరిరక్షణకు హైడ్రా వేగం పెంచి పనిచేయాలని సూచించారు. ఇదిలా ఉండగా.. 33 బృందాలు మూసీ పరివాహక ప్రాంతంలో పేదల సమస్యలను తెలుసుకున్నాయి. దుర్గంధంలో దుర్భర జీవితాలను గడుపుతున్న పేదల కష్టాలను తెలుసుకున్నాం. ప్రపంచంతో పోటీ పడే నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం. ఉపాధి కల్పనతో అక్కడి పేదలను ఆదుకోవాలనే ఆలోచన మా ప్రభుత్వానికి ఉంది. ఇది సుందరీకరణ కోసం కాదు.. ఇది మూసీ పునరుజ్జీవనం కోసమని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్మీట్‌లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed