నా భర్త ఓకే అంటేనే మరొకరికి లిప్‌లాక్ ఇచ్చా.. ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ నటి షాకింగ్ కామెంట్స్!

by Hamsa |   ( Updated:2024-10-18 14:15:44.0  )
నా భర్త ఓకే అంటేనే మరొకరికి లిప్‌లాక్ ఇచ్చా.. ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ నటి షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: గత ఏడాది రణ్‌వీర్ సింగ్(Ranveer Singh), అలియా భట్(Alia Bhatt) కాంబోలో వచ్చిన ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’(Rocky Aur Rani's Prem Kahani) సినిమా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనిని స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్(Karan Johar) తెరకెక్కించగా.. జయాబచ్చన్, షబానా అజ్మీ, ధర్మేంద్ర వంటి వారు కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా మొత్తానికి ఓ సీన్ హైలెట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సీనియర్ నటి షబానా అజ్మీ(Shabana Azmi), ధర్మేంద్ర లిప్‌లాక్ఇచ్చుకున్న సన్నివేశం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది.

తాజాగా, లిప్‌లాక్ సన్నివేశం గురించి షబానా షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ (Rocky Aur Rani's Prem Kahani)సినిమా మేకర్స్ నన్ను సంప్రదించినప్పుడు కథ నచ్చడంతో ఓకే చేశాను. ఇందులోని లిప్‌లాక్ సీన్ గురించి కరణ్ నాకు ముందే వివరించారు. ఇక అది విన్న తర్వాత నేను నా భర్త అనుమతి తీసుకొని చెబుతానని చెప్పాను.

ఈ విషయం గురించి నా భర్తను అడిగితే ఆయన ఇది చాలా చిన్న విషయం దీనికి నా అనుమతి ఎందుకు చేయమని అనడంతో నటించాను. అయితే నేను ఈ చిత్రంలో చేసిన పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ షబానా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసిన వారు ఇలా కూడా ఉంటారా అని రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

Advertisement

Next Story