- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నాడు హైయస్ట్ స్కోర్ చేజ్.. నేడు అత్యల్ప స్కోర్ డిఫెండ్.. చరిత్ర సృష్టించిన పంజాబ్

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరూ ఊహించని జట్లు భారీ విజయాలను అందుకుంటున్నాయి. భారీ స్కోర్ సాధించాల్సిన జట్లు, అతి తక్కువ పరుగులకే పరిమితం అవుతున్నాయి. దీంతో ఐపీఎల్ (ఐపీఎల్) అంటేనే ఇది అని క్రికెట్ అభిమానులు చెబుతున్నారు. కాగా క్రమంలోనే మంగళవారం రాత్రి పంజాబ్ (Punjab), కేకేఆర్ జట్ల జరిగిన మ్యాచ్ మరో చరిత్రను సృష్టించింది. గతంలో ఈ రెండు జట్లు తలపడినప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే (History of IPL) భారీ స్కోర్ చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది. దీంతో ఈ మ్యాచ్ లోను పరుగుల వరద పారుతుందని అంతా అంచనా వేశారు. కానీ ఎవరూ ఊహించని విధంగా.. మొదటి ఇన్నింగ్స్ లో పంజాబ్ జట్టు కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కేకేఆర్ (KKR) 10 ఓవర్లలోనే విజయం సాధిస్తుందని అంతా అంచనా వేశారు.
కానీ ఎవరు ఊహించని విధంగా.. పంజాబ్ బౌలర్ల విజృంభించారు. ముఖ్యంగా చాహల్ (Chahal) నాలుగు కీలక వికెట్లు తీసుకొని కేకేఆర్ షాక్ ఇచ్చాడు. అలాగే మార్కో జెన్ సన్ 3 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో రస్సేల్ క్రీజులో ఉన్నప్పటికి ఆర్షదీప్, జెన్ సన్ లు బౌలింగ్ వేశారు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరుని డిఫెండ్ (Defend the lowest score) చేసిన జట్టుగా పంజాబ్ జట్టు చరిత్రలో నిలిచిపోయింది. కాగా గత సీజన్లో ఇదే జట్టుపై పంజాబ్ ఏకంగా 261 పరుగులను చేజ్ చేసి.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులను చేజ్ చేసిన జట్టుగా చరిత్రను సృష్టించింది. దీంతో నాడు హైయస్ట్ స్కోర్ చేజ్ చేసిన జట్టు.. నేడు అత్యల్ప స్కోర్ డిఫెండ్ చేసుకొని చరిత్ర సృష్టించిందని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.