Barbie core: జీబ్లీ స్టైల్‌కి ఫుల్‌స్టాప్ పడిందిగా.. ఇక ఇప్పుడంతా బార్బీ కోర్ వాహనే!

by D.Reddy |
Barbie core: జీబ్లీ స్టైల్‌కి ఫుల్‌స్టాప్ పడిందిగా.. ఇక ఇప్పుడంతా బార్బీ కోర్ వాహనే!
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో (Social media) రోజుకో ట్రెండ్ వైరల్ అవుతుందనటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. మొన్నటి వరకు జీబ్లీ స్టూడియో స్టైల్ (Ghibli Studio Style) ఇమేజ్‌లు నెట్టింట ఎంతగా సందడి చేశాయో అందరికి తెలిసిందే. సెలబ్రెటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు తమ ఫొటోలను జీబ్లీ స్టైల్‌లోకి మార్చుకుని వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో షేర్ చేశారు. అయితే, ఇప్పుడు దీని వంతు అయిపోయింది. సోషల్ మీడియాలోకి తాజాగా మరో కొత్త ట్రెండ్ వచ్చి చేరింది. ఏఐ డిజిటల్‌ ఆర్ట్‌ (AI Digital Art) ట్రెండ్‌లో ఇప్పుడు బార్బీకోర్‌ (Barbiecore) హవా మొదలైంది. దీని ప్రత్యేకత ఏంటని ఆలోచిస్తున్నారా?

అయితే, మన చిన్నప్పటి బార్బీ బొమ్మలు తెలుసు కదా. అందమైన రూపంతో చుట్టూ ఆ పాత్రకు సరిపోయిన వస్తువులతో ఎంతో క్యూట్‌గా ప్యాక్ చేసి ఉంటాయి. అచ్చం ఆ బొమ్మల మాదిరిగా 'బార్బీకోర్' ట్రెండ్ మన ఫొటోలను క్రియేట్ చేస్తుంది. ఒక్క బార్బీ రూపంలోనే కాదు, కెన్, మార్వెల్‌ సూపర్‌ హీరో.. ఇలా ఏ బొమ్మ రూపంలోనైనా ఇమేజ్‌లను రూపొందిస్తుంది. దీంతో నెటిజన్లు ఈ కొత్త బార్బీకోర్‌ ట్రెండ్‌తో తమ ఫొటోలను డిజిటల్‌ బొమ్మ బాక్సులో వినోద, యాక్షన్‌ భరిత అవతార్ల రూపాల్లోకి మార్చుకుని నెట్టింట పోస్టు చేస్తున్నారు. తమవే కాదు.. ఇష్టమైన సెలబ్రిటీల ఫొటోలతోనూ బార్బికోర్స్‌ను సృష్టించుకొని, షేర్‌ చేసుకుంటున్నారు.

ఎలా క్రియోట్ చేసుకోవాలంటే?

* ముందుగా చాట్‌జీపీటీ యాప్‌ లేదా వెబ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయాలి.

* నచ్చిన ఫొటోను ఎంచుకుని అప్‌లోడ్‌ చేయాలి. హై-రెజల్యూషన్‌ ఉన్న ఫొటో అయితే మంచిది.

* అనంతరం సరైన ప్రాంప్ట్‌ టైప్‌ చేయాలి. ఉదాహరణకు ఈ ఫొటోను నిజమైన బార్బీ యాక్షన్‌ బొమ్మగా మార్చమని రాయాలి. బాక్సులో ఏమేం ఉండాలో కూడా (ఉదా: కెమెరా, కళ్లద్దాలు) వివరించాలి. బాక్సు మీద మీ పేరు, ముద్దుపేరు వచ్చేలా వాటిని బోల్డ్‌లో రాయాలి.

* వీటి ఆధారంగా చాట్‌జీపీటీ బొమ్మ బాక్సు తరహాలో ఇమేజ్‌ను సృష్టిస్తుంది. ఒకవేళ అది నచ్చకపోతే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.

* నచ్చినట్టుగా తయారైన బొమ్మ రూపాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని, షేర్‌ చేసుకోవచ్చు.

Next Story

Most Viewed