- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విద్యార్థులకు అలర్ట్.. 22న ఇంటర్ ఫలితాలు

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను ఈ నెల 22 న విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 22 న ఉదయం 12 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలోని విద్యాభవన్ లో ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బీసీ వెల్ఫేర్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొంటారని పేర్కొన్నారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in లలో వారి ఫలితాలను చూసుకోవచ్చని సెక్రటరీ తెలిపారు. విద్యార్థులు ఏవైనా సందేహాలు, సలహాల కొరకు ఐవీఆర్ పోర్టల్ 9240205555 ను అలాగే హెల్ప్ డెస్క్ ie@telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు.
అనుకున్న సమయానికే ఫలితాలు:
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలను మార్చి 5 నుంచి 25 వరకు నిర్వహించారు. పస్ట్ ఇయర్ పరీక్షలకు 4, 88, 448 మంది, సెకండియర్ పరిక్షలకు 5,08,253 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 18 నుంచే స్పాట్ వాల్యుయేషన్ ను 19 కేంద్రాల్లో ప్రారంభించిన ఇంటర్ బోర్డు అనుకున్న సమయానికే ఫలితాలు వెలువరించేలా పకడ్భందీ ఏర్పాట్లు చేసింది. తొలిసారిగా రాండం రీవాల్యుయేషన్ సైతం నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఇంటర్మీడియట్ బోర్డు జాగ్రత్తలు తీసుకుంది. దాదాపు 60 వేల మంది ప్రతి సంవత్సరం రీ వాల్యుయేషన్ కు అప్లై చేస్తున్నారని ద్రుష్టిలో పెట్టుకుని పాస్ మార్కులకు దగ్గర్లో ఉన్న వారి పేపర్లను రీవాల్యుయేషన్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రెండు దశల్లో పరిశీలన చేసిన తర్వాతే ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డు భావించింది. సీజీజీ ఆమోద ముద్రలతో ప్రభుత్వం అనుమతి తీసుకుని ఈనెల 22న ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాల వెల్లడి తర్వాత రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కు సైతం అవకాశం ఇవ్వనున్నారు. నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయనున్నారు.