సముద్రంలో ఉపరితల శ్రేణి.. రాయలసీమకు బిగ్ అలర్ట్

by srinivas |   ( Updated:19 April 2025 4:51 PM  )
సముద్రంలో ఉపరితల శ్రేణి.. రాయలసీమకు బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: సముద్రం(Ocean)లో ఉపరితల శ్రేణి(Surface Layer) కొనసాగుతోంది. సముద్రమట్టానికి 1.5 ఎత్తులో విస్తరించింది. దీంతో రాయలసీమ(Rayalaseema)కు వాతావరణ శాఖ అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ఛాన్స్ ఉందని వెల్లడించారు. అలాగే ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని, రైతులు, గొర్రెలకాపరులు బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని అధికారులు హెచ్చరించారు.



Next Story

Most Viewed