Isha Foundation: సద్గురు జగ్గీ వాసుదేవ్ కు సుప్రీంకోర్టులో ఊరట

by Shamantha N |   ( Updated:2024-10-18 08:39:50.0  )
Isha Foundation: సద్గురు జగ్గీ వాసుదేవ్ కు సుప్రీంకోర్టులో ఊరట
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆధ్యాత్మిక గురువు స‌ద్గురు జ‌గ్జీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev)కు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్‌ (Isha Foundation)పై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. త‌న ఇద్దరు కూతుళ్లను స‌ద్గురు ఈషా యోగా సెంట‌ర్‌ నుంచి బయటకు రానివ్వడం లేదంటూ ఓ వ్యక్తి ఇటీవలే హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఆ ఇద్దరు మహిళలు ఈషా కేంద్రంలో స్వచ్ఛందంగానే ఉంటున్నారని కోర్టుకు పోలీసులు తెలిపారు. దానిక సంబంధించిన వివరాలు కూడా సమర్పించారు. ఆధారాలన్నింటిని పరిశీలించిన కోరట్.. కేసుని కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ..

ఇటీవలే మద్రాస్ హైకోర్టు ఈషా ఫౌండేషన్‌కు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు దాదాపు 150 మంది పోలీసులు ఈషా ఫౌండేషన్‌లో తనిఖీలు చేశారు. కాగా.. ఈ వ్యవహారంపై ఈషా ఫౌండేషన్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీంతో ఈ కేసు మద్రాసు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు బదిలీ అయ్యింది. దీనిపై ఇటీవలే విచారణ జరిపిన కోర్టు.. మహిళల వాంగ్మూలాన్ని బట్టి వారు స్వచ్ఛందంగా ఆశ్రమంలో ఉండటంపై ఎలాంటి సందేహాలు లేవని పేర్కొంది. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా ని చర్యలు చేపట్టాలని తమిళనాడు పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed