- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భక్తులకు శుభవార్త చెప్పిన మంత్రి..
దిశ, అలంపూర్ టౌన్: ఐదో శక్తిపీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం నుంచి అలంపూర్ చౌరస్తా వరకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. జోగులాంబ బాల బ్రహ్మమేశ్వర స్వామి అమ్మవార్లను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ, పాలక మండలి చైర్మన్,అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా గణపతి పూజ అనంతరం స్వామి వారికి అభిషేకాలు చేశారు. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జోగులాంబ ఆలయాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఎన్ని శక్తులు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూసిన కూడా పేదలకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే శక్తిని ప్రభుత్వానికి ఇవ్వాలని అమ్మవారిని కోరినట్టు మంత్రి వెల్లడించారు. అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం సాయంత్రం అమ్మవారి హారతి అనంతరం ఆలయం నుంచి అలంపూర్ చౌరస్తా వరకు ప్రత్యేక బస్సులు నడపడానికి ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి పేర్కొన్నారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో.. వేములవాడ మాదిరిగా ఇక్కడ కూడా భక్తులకు అన్నదాన సత్రాలు రూములు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.