MLA Kumbham : మూసీ ప్రక్షాళనకు పార్టీలకు అతీతంగా సహకరించాలి

by Kalyani |
MLA Kumbham : మూసీ ప్రక్షాళనకు పార్టీలకు అతీతంగా సహకరించాలి
X

దిశ, వలిగొండ:- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళనకు పార్టీలకు అతీతంగా సహకరించాలని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం వలిగొండ పట్టణంలోని అక్కాచెల్లెళ్ల చెరువులో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా స్థానిక సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… గత ప్రభుత్వం నాసిరకం చేప పిల్లలు,గొర్రెల పంపిణీ చేసి అవినీతికి పాల్పడిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు. భవిష్యత్తులో ఈ చేప పిల్లల పెద్దవై మత్స్య కార్మికులు లాభాలు పొందుతారని అన్నారు. నియోజకవర్గంలో నిండిన ప్రతి చెరువులో చేప పిల్లలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

భువనగిరి నియోజకవర్గంలో 55 మత్స్య కార్మిక సహకార సంఘాలకు చేప పిల్లలను వితరణ చేయడం జరుగుతుందని అన్నారు. మూసీ కాలుష్యం వల్ల మత్స్య కార్మికులు,చేనేత కార్మికులు, కర్షకులు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మూసీ కాలుష్యాన్ని రూపుమాపడానికి ఉద్యమ కార్యాచరణ చేపట్టాలన్నారు. మూసీ కాలుష్య నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని, అదేవిధంగా త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణంతో భువనగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార అధికారులు డిడి లక్ష్మీనారాయణ, ఎఫ్ డి ఓ రాజారాం, సంఘం జిల్లా అధ్యక్షులు సంజీవ, వలిగొండ పట్టణ సంఘం అధ్యక్షులు సోమనబోయిన సతీష్, సింగిల్ విండో డైరెక్టర్ కుంభం విద్యాసాగర్ రెడ్డి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నాయకులు బోళ్ల రామచంద్రయ్య, కాంగ్రెస్ మండల పట్టణ పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య,తుమ్మల యుగంధర్ రెడ్డి, గరిసె రవి,పబ్బు ఉపేందర్ బోస్,గూడూరు శివశాంత్ రెడ్డి,సామ రాంరెడ్డి,వాకిటి అనంతరెడ్డి,బాతరాజు నరసింహ,బత్తిని సహదేవ్,భీమా నాయక్, గుర్రం లక్ష్మారెడ్డి,గుండు దానయ్య,బడుగు సత్యనారాయణ,కొండూరు భాస్కర్ గౌడ్,ఐటిపాముల రవీంద్ర,చెరుకు శివయ్య,బద్దం సంజీవరెడ్డి,కాసుల వెంకన్న,కొండూరు సాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed