నువ్వు ఆన్‌లైన్.. నీ అయ్యా ఫ్లైట్ మోడ్ అంటున్నారు చూసుకో.. కేటీఆర్‌పై ఎంపీ ఘాటు విమర్శలు

by Ramesh N |
నువ్వు ఆన్‌లైన్.. నీ అయ్యా ఫ్లైట్ మోడ్ అంటున్నారు చూసుకో.. కేటీఆర్‌పై ఎంపీ ఘాటు విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నువ్వు ఆన్లైన్, నీ పార్టీ ఆఫ్ లైన్, నీ అయ్యా ఫ్లైట్ మోడ్ అంటున్నారు చూసుకో అంటూ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మూసీలో మూడు రోజులు ఉండాలని, అక్కడ ఉండే వారి భాద మీకు తెలుస్తుంది అని అంటే అంత ఉలిక్కిపాటు ఎందుకు డ్రామారావు అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కేటీఆర్‌పై మండిపడ్డారు. నిన్న సీఎం మూసీ ప్రక్షాళన గురించి వివరంగా చెప్పండంతో రాత్రి నిద్రపట్టలేదా అంటూ నిలదీశారు. మూసీ నది పరిరక్షణ మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. నల్గొండ రైతుల కష్టాలు, మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయన్నారు. మీరు చేత‌కాని ద‌ద్ద‌మ్మలు కాబట్టే ప్రజలు మాకు అధికారం ఇచ్చారు సన్నాసి.. అని విమర్శించారు.

గడ్డి వాము దగ్గర కుక్క మాదిరి ఉంది నీ వ్యవహారం అని, కుక్క గడ్డి తినదు గడ్డి తినే ఆవును దగ్గరకు రానివ్వదన్నారు. నువ్వు మూసీ పక్కన ఒక్క రోజు ఉండలేవు ఉండే వారికి మంచి బతుకు కల్పిస్తాం అంటే ఒరవలేవు అని పేర్కొన్నారు. నీది దోర అహంకారం కాబట్టే నువ్వు గడీలో ఉండాల పేదోళ్ళు మురికి కూపంలోనే మగ్గిపోవాలి అని అలోచిస్తావ్ అని వెల్లడించారు. అభివృద్ధి అంటే సిటీలో ఒకవైపు జరగడం కాదన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున 40కిలోమీటర్ల పైన మురికి కూపం ఉంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగినట్లా? అని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టులో 1,50,000 కోట్లు దోచుకుంటున్నారు అంటున్నావ్ అంటే పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్లు ఉంది నీ వ్యవహారం, దోచుకుతినడం బాగా అలవాటు అయ్యి నిద్రపట్టడం లేదు నీకు! అని విమర్శించారు.

ఢిల్లీకి డ‌బ్బు సంచులు పంప‌కుండానే చెల్లి తీహార్ నుంచి హైదరాబాద్ వచ్చిందా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను అన్ని వైపుల అన్ని రకాలుగా అబివృద్ధిపరచి ప్రక్రుతి వైపరీత్యాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాడమే మా లక్ష్యమన్నారు. ఇంగ్లీష్ మాట్లాడితేనో ,24 గంటలు ట్విట్టర్‌లో ట్వీట్‌లు చేస్తేనో, సినిమా వాళ్ళతో సంబంధాలు ఉంటేనో నాలెడ్జ్ ఉన్నట్లు కాదు డ్రామారావు.. అంటూ ఘాటు విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed