Ananya Nagalla: ఫ్లైట్‌‌ను కూడా వదలని అనన్య.. ఆ పని చేయడంతో ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

by Hamsa |   ( Updated:2024-10-18 15:55:41.0  )
Ananya Nagalla: ఫ్లైట్‌‌ను కూడా వదలని అనన్య.. ఆ పని చేయడంతో ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ‘వకీల్ సాబ్’ సినిమాలో కీలక పాత్రలో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రజెంట్ అనన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పొట్టేల్’(pottel). దీనిని సాహిత్ తెరకెక్కిస్తుండగా.. నిశాంక్ రెడ్డి, సురేష్ కుమార్ నిర్మించారు.

అయితే ఇందులో చంద్ర కృష్ణ(Chandra Krishna), అనన్య జంటగా నటించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ‘పొట్టేల్’(pottel) సినిమా అక్టోబర్ 25న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా అన్నింటినీ వాడుకుంటున్నారు. తాజాగా, అనన్య నాగళ్ల (Ananya Nagalla)‘పొట్టేల్’ ప్రమోషన్స్ కోసం ఏకంగా తను ప్రయాణిస్తున్న ఫ్లైట్ సైతం వదల్లేదు.

నోయల్(noelsean), అనన్య, చంద్ర కలిసి ఫ్లైట్‌లో ప్రయాణికులకు ‘పొట్టేల్’ పోస్టర్లు అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను అనన్య తన ‘X’ వేదికగా షేర్ చేస్తూ ‘‘ఆడ చేస్తాం ఈడ చేస్తా యాడైనా చేస్తా’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఫ్లైట్‌లో ఇలా కూడా చేస్తారా అని అంటున్నారు.


Read More ...

Ananya Nagalla: కమిట్మెంట్‌ను బట్టే పారితోషికం ఎక్కువ ఉంటుందా.. రిపోర్టర్ ప్రశ్నకు హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై

Advertisement

Next Story