TGCET Notification: విద్యార్థులకు అలర్ట్.. గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్..!

by Maddikunta Saikiran |
TGCET Notification: విద్యార్థులకు అలర్ట్.. గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన(ST), బీసీ(BC), సాంఘిక సంక్షేమ(SC) గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(TGCET) నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ పరీక్షకు సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ డిసెంబర్ 21న ప్రారభం కానుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://tgcet.cgg.gov.in/ ద్వారా ఫిబ్రవరి 01, 2025 వరకు ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులు రూ. 100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఫోన్ నెంబర్‌ సాయంతో ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చు.

విద్యార్హత:

2024-25 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

ప్రవేశ పరీక్ష, స్థానికత, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వయస్సు:

ఓసీ, బీసీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య.. ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆదాయ పరిమితి:

విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూరల్ ప్రాంతం అయితే రూ.1.50,000.. అదే అర్బన్ ప్రాంతం అయితే.. రూ.2,00,000 మించకూడదు.

ప్రవేశ పరీక్ష తేదీ:

ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రంలోని అన్నీ జిల్లా కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed