- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండస్ట్రీలో చెప్పే వారే కానీ సహాయపడేవారు లేరు.. దుమారం రేపుతున్న స్టార్ నటుడు డాటర్ కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్న సాయికుమార్ మనందరికీ సుపరిచితమే. ఈయన ఫస్ట్ టైం అప్పటి స్టార్ హీరోలయినటువంటి ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన ‘సంసారం’ అనే సినిమాకి డబ్బింగ్ అందించారు. ఆ తర్వాత బాల నటుడిగా అవకాశం అందుకుని ‘దేవుడు చేసిన పెళ్లి’ అనే మూవీలో అంధుడి పాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత కన్నడ చిత్రాలలో హీరోగా నటించారు. కానీ, ఈయన తెలుగు చిత్రాలతోనే ఫేమ్ తెచ్చుకున్నారు.
ఇదిలా ఉంటే.. సినీ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ తమ పని తాము చేసుకుంటూ పోయే ఫ్యామిలీలలో సాయికుమార్ కుటుంబం కూడా ఒకటి అని చెప్పాలి. ఈ క్రమంలో సాయి కుమార్ కుమార్తె చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి కుమార్ కూతురు జ్యోతిర్మయి (Jyothirmai) షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘బాబాయ్ రవిశంకర్ (Ravi Shankar) చేసిన సినిమా వల్ల నాన్న ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా వారే కష్టపడుతూ అప్పులు తీర్చేశారు’ అని తెలిపింది. ఇక ఆ సమయంలో అటు మెగాస్టార్ ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీల నుంచి మీకు ఎటువంటి సహాయం లభించలేదా అని యాంకర్ అడుగగా..
దీనికి స్పందిస్తూ.. ‘ఇండస్ట్రీలో సహాయం చేస్తామని చెబుతారే కానీ ఎవరు మాకు సహాయపడలేదు. ఆ సమయంలో ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. పైగా మమ్మల్ని పట్టించుకున్న నాథుడు కూడా లేడు’ అంటూ జ్యోతిర్మయి సంచలన కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీలుగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి, అక్కినేని, మెగా ఫ్యామిలీలను ఉద్దేశిస్తునే జ్యోతిర్మయి ఇన్ డైరెక్ట్‌గా కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.