వామ్మో.. ఈ పాము కాటేస్తే అత్యంత భయంకరమైన చావు తప్పదు.. శరీరంలోని ప్రతి రంధ్రం నుంచి రక్తం బయటకొచ్చి..

by Sujitha Rachapalli |
వామ్మో.. ఈ పాము కాటేస్తే అత్యంత భయంకరమైన చావు తప్పదు.. శరీరంలోని ప్రతి రంధ్రం నుంచి రక్తం బయటకొచ్చి..
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాములు ఉన్నాయి. వీటిలో ఆఫ్రికాలోని సహారా ఎడారికి దక్షిణ ప్రాంతంలో నివసించే బూమ్ స్లాంగ్ (Dispholidus typus) కూడా ఒకటి. కాగా ఈ పాము కాటు వేస్తే మనిషి శరీరంలోని ప్రతి రంధ్రం నుంచి రక్తం బయటకు వచ్చి ప్రాణభయంతో కొట్టుకుంటాడు. ట్రీ స్నేక్ అని కూడా పిలువబడే ఈ పాము.. చెట్లపై ఎక్కువగా కనిపిస్తుంది. సన్నని శరీరం, పెద్ద కళ్ళు, గుండె ఆకారంలోని తలతో .. ఆకుపచ్చ, గోధుమ లేదా గోధుమ-ఆకుపచ్చ మిశ్రమ రంగులో ఉంటుంది. దీంతో చెట్లలో సులభంగా కలిసిపోతుంది. సగటున 1-1.8 మీటర్ల పొడవు ఉండే ఈ స్నేక్ విషం అత్యంత ప్రమాదకరంగా చెప్పబడుతుంది.

బూమ్‌స్లాంగ్ విషం హెమోటాక్సిక్‌గా ఉంటుంది. అంటే రక్తం గడ్డకట్టడాన్ని ఆపివేసి.. రక్తస్రావానికి కారణమవుతుంది. దీని కాటు తక్షణం లక్షణాలను చూపకపోవచ్చు. కానీ చికిత్స చేయకపోతే కొన్ని గంటల్లో మరణానికి దారితీస్తుంది. పక్షులు, బల్లులు, చిన్న క్షీరదాలను ఆహారంగా తీసుకుంటుంది. చెట్లపైనే వేటాడుతుంది. బూమ్‌స్లాంగ్ సాధారణంగా పిరికిగా.. మానవులకు దూరంగానే ఉంటుంది. కానీ బెదిరింపు ఎదురైతే దాడి చేయవచ్చు. ఒకవేళ కాటు వేసిందంటే... శరీరంలోని ప్రతి రంధ్రం నుంచి రక్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. దీని విషం రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని నాశనం చేసి, రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీని వల్ల అంతర్గత, బాహ్య రక్తస్రావం జరుగుతుంది. తీవ్రమైన సందర్భాల్లో ముక్కు, చెవులు, కళ్ళు, నోరు, శరీరంలోని ఇతర రంధ్రాల నుంచి రక్తం కారవచ్చు. అలాగే చర్మం కింద కూడా రక్తస్రావం జరగవచ్చు. చికిత్స చేయకపోతే రక్తస్రావం అనియంత్రితంగా మారి మరణానికి దారితీస్తుంది. యాంటీవీనమ్, తక్షణ వైద్య సహాయంతో ఈ ప్రభావాలను నియంత్రించవచ్చు.



Next Story

Most Viewed