- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతును మరిచిన కాంగ్రెస్ పార్టీ : హరీష్ రావు
దిశ,ఖమ్మం సిటీ : ఖమ్మం వ్యవసాయ పత్తి మార్కెట్ ను ఈ రోజు బీ ఆర్ ఎస్ మాజీ మంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని బోనస్ మాట బోగస్ అయింది మద్దతు ధర కూడా రావట్లేదని ధ్వజమెత్తారు. ప్రస్తుతం మార్కెట్లో మద్దతు ధర రూ.7521 లు ఉంటే 6500 రూపాయలు కూడా మద్దతు ధర పత్తికి రాలేదన్నారు. రైతు పండించిన పత్తికి ప్రతి క్వింటాకు రైతుకు 1500 నష్టం వాటిల్లుతుందని ఆవేదన చెందారు.లక్షా ఇరవై వేల మెట్రిక్ టన్నులు కూడా పత్తి కొనలేదు మొత్తం దళారులకే పోతుందన్నారు.ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం కుట్రలు చేయడం తప్ప కాంగ్రెస్ చేసింది జీరో అని ఎద్దేవా చేశారు.వరి,పత్తి పంట దళారుల పాలు అవుతుంది ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు.
రైతు బంధు లేని రుణమాఫీ లేని మద్దతు ధర లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని హరీష్ తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పత్తికి గరిష్టంగా 11 వేలు కనిష్టంగా 9 వేలు ధర పలికిందని ఇప్పుడు ఎందుకు ధర తగ్గిందని ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. పత్తి రైతులకు మద్దతు ధర రావాలి 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఖమ్మం మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.సీసీఐ రైతుల దగ్గర పత్తిని కొనట్లేదు కానీ దళారుల దగ్గర కొంటున్నరాని స్పష్టం చేశారు. ఇక మరో వైపు మిర్చి ధర మరి దిగజారిందని మిర్చి కి రూ 13 వేలు కూడా రాటల్లేదని విచారం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు చేతలు గడప దాటల్లేదని హేళన చేశారు.జిల్లా మంత్రులు ఆధిపత్యం కోసం బాగా బిజీ అయ్యారని విమర్శించారు.ప్రజా సమస్యలను గాలికొదిలి గొప్పలకు పోతున్నారని అన్నారు. సన్నాలకు బోనస్ కూడా ఇవ్వట్లేదని ఖమ్మం జిల్లాలో సన్నాలు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని ఒక్క రైతుకు అయినా బోనస్ ఇచ్చారా మొత్తం దళారులు కొంటున్నారని విమర్శించారు. ఆంధ్రా దళారులు వరి ధాన్యం కొనుక్కొంటున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి కి వాళ్ళ కమిషనర్ మాటలకే తేడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు,మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్,గంగుల కమలాకర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్,ఖమ్మం జిల్లా నాయకులు గుండాల కృష్ణ,కొండబాల కోటేశ్వరరావు,నగర నాయకులు పగడాల నాగరాజు,సతీష్ ,నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.