వాతావరణ కాలుష్యం పై అధికారులు దృష్టి సారించాలి..

by Sumithra |
వాతావరణ కాలుష్యం పై అధికారులు దృష్టి సారించాలి..
X

దిశ, సనత్ నగర్ : హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు వాహనాల రద్దీ పెరిగిపోతున్న దృష్ట్యా వాతావరణ కాలుష్యం పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సనత్ నగర్ లోని వివిధ కాలనీ వాసులు కోరుతున్నారు. సనత్ నగర్ డివిజన్ లోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుండి సనత్ నగర్ బస్టాండ్ వరకు గల సండే మార్కెట్ లో ప్రతినిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో వాహనాల రద్దీ పెరిగిపోవడంతో వాహనాల పొగతో ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు.

సనత్ నగర్ లోని తులసి నగర్, బల్కంపేట్ రోడ్, స్వామి టాకీస్ రోడ్ , నెహ్రూ పార్క్ తదితర ప్రాంతాల్లో వాహనాల పొగ ప్రభావంతో శ్వాసకోశ వ్యాధుల బారిన బడే ప్రమాదముందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. అలాగే అంతర్గత రోడ్ల పై చెత్తను ఇష్టానుసారంగా వదులుతుండడంతో దుర్వాసన వెదజల్లుతుందని దీంతో దోమలు వ్యాప్తి చెంది రోగాల బారిన పడుతున్నామని ఆయా కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వాతావరణ కాలుష్యంతో పాటు వీధులలో పరిశుభ్రత పై దృష్టి సాధించాలని వారు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed