రాచ కాల్వ సర్వే త్వరగా పూర్తి చేయాలి.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..

by Sumithra |
రాచ కాల్వ సర్వే త్వరగా పూర్తి చేయాలి.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..
X

దిశ, చైతన్య పురి : రాచ కాలువ మొత్తం సర్వే చేయించి యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఇరిగేషన్ అధికారులకు సూచించారు. బీఏన్ రెడ్డి నగర్ డివిజన్ శివారు కాలనీల డ్రైనేజీ అవుట్ లెట్ కోసం ట్రంక్ లైన్ నిర్మాణం కోసం మలివిడత దాదాపు రూ. 2 కోట్లు మంజూరు చేయించారన్నారు. కాంట్రాక్టర్ ట్రంక్ లైన్ పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచ కాలువ సర్వే త్వరగా పూర్తి చేసి వచ్చే వర్షాకాలంలోపు ట్రంక్ లైన్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కటిక రెడ్డి అరవింద్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు శుక్లాజ, సతీష్, అశోక్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed