- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్ నం.3 ర్యాంక్ జోడీకి షాకిచ్చిన స్వాతిక్ జంట.. చైనా మాస్టర్స్‌లో సెమీస్‌కు
దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల డబుల్స్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి అదరగొడుతున్నారు. టైటిల్ దిశగా దూసుకెళ్తున్న ఈ జంట సెమీస్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్ జోడీ తన కంటే మెరుగైన ర్యాంక్ జంటను చిత్తు చేసింది. వరల్డ్ నం. 9వ ర్యాంక్‌లో ఉన్న సాత్విక్, చిరాగ్ ద్వయం 21-16, 21-19 తేడాతో 3వ ర్యాంక్‌లో ఉన్న కిమ్ ఆస్ట్రప్-అండర్స్ స్కారప్(డెన్మార్క్) జోడీపై విజయం సాధించింది. 47 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో భారత జంట స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది.
సెమీస్‌లో సాత్విక్ జోడీ.. టకుర హోకీ-యుగో కొబయాషి జోడీ(జపాన్) లేదా జెన్ యోంగ్-జియో సీయింగ్ జే(కొరియా) జంటతో తలపడనుంది.పారిస్ ఒలింపిక్స్ వైఫల్యం తర్వాత సాత్విక్, చిరాగ్ పాల్గొన్న తొలి టోర్నీ ఇదే. మరోవైపు, స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 18-21, 15-21 తేడాతో డెన్మార్ ప్లేయర్ అండర్స్ అంటోన్సెన్ చేతిలో ఓడిపోయాడు. సింధు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్ర్కమించిన విషయం తెలిసిందే. లక్ష్యసేన్ కూడా ఓడిపోవడంతో సింగిల్స్‌లో భారత్ పోరాటం ముగిసింది. టోర్నీలో ఇక భారత్‌కు మిగిలిన ఏకైక ప్రాతినిధ్యం సాత్విక్, చిరాగ్ జోడీనే.