రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి.. డివిజన్ కార్పొరేటర్

by Sumithra |
రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి.. డివిజన్ కార్పొరేటర్
X

దిశ, చైతన్యపురి : రోడ్డు నిర్మాణపు పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం డివిజన్ లోని ఎస్ఎఫ్ కాలనీలో జరుగుతున్న నూతన రోడ్డు నిర్మాణం పనులను జీహెచ్ఎంసీ డీఈ దామోదర్ రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లెవెల్స్ సరి చూసుకుంటూ రాబోవు కాలంలో కాలనీ వాసులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈ రాజ్ కుమార్, కాలనీ సభ్యులు దామోదర్ రెడ్డి, కృష్ణ, మధుకర్ రెడ్డి పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేవైఎం సెక్రటరీ పవన్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed