Kannappa : ‘కన్నప్ప’ సినిమాలో మోహన్‌బాబు పాత్ర ఇదే

by Prasanna |
Kannappa : ‘కన్నప్ప’ సినిమాలో మోహన్‌బాబు పాత్ర ఇదే
X

దిశ, వెబ్ డెస్క్ : మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీం ప్రాజెక్టు ‘కన్నప్ప’ ( Kannappa ) మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. న్యూజిలాండ్ అడవులు, రామోజీ ఫిలిం సిటీలో పెద్ద పెద్ద సెట్స్ వేసి షూటింగ్ చేశారు. మోహన్ బాబు (Mohan Babu) ఈ మూవీని రూ. 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మధుబాల, ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్ లు నటిస్తున్నారు.

మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న చిత్రం ‘కన్నప్ప’ సినిమాలో మోహన్‌బాబు చేయబోయే పాత్రను రివీల్ చేశారు. ఇప్పటికే, ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు, మోహన్ బాబు పాత్రను పరిచయం చేయడంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. మహదేవ శాస్త్రిగా కనిపించనున్నట్లు తెలుపుతూ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఈ పాత్ర ఎన్నో రోజులు గుర్తుంటుందంటూ మూవీ టీం తెలిపింది.

Advertisement

Next Story