కాటన్‌ మిల్లులో అగ్నిప్రమాదం

by Naveena |
కాటన్‌ మిల్లులో అగ్నిప్రమాదం
X

దిశ నాగర్ కర్నూల్ /తెలకపల్లి: షార్ట్ సర్క్యూట్ సమస్య తలెత్తి కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం చిన్న ముద్దునుర్ గ్రామ శివారులోని వినాయక కాటన్ మిల్లు లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కాటన్ మిల్లులోని సిబ్బంది ఎవరి పనుల్లో వారు ఉండగా..అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు రైస్ మిల్లు సిబ్బంది ప్రయత్నం చేశారు. స్థానికుల సమాచారంతో..ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది. అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాటన్ మిల్లు లో మెషిన్లు, పత్తి కాలిపోవడంతో..భారీ నష్టం వాటిల్లినట్లు సిబ్బంది తెలిపారు.

Advertisement

Next Story