జోగిపేట ప్రభుత్వాసుపత్రిలో పారిశుద్ద్యం భేష్‌...

by Sumithra |
జోగిపేట ప్రభుత్వాసుపత్రిలో పారిశుద్ద్యం భేష్‌...
X

దిశ, అందోల్‌ : ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని, నిర్లక్ష్యం చేయకూడదని డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సంగారెడ్డి సూచించారు. శుక్రవారం జోగిపేటలోని ప్రభుత్వాసుపత్రిని అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డుల్లో పర్యటించి, రోగులతో వైద్య సేవల గూర్చి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వాసుప్రతుల్లో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అసుపత్రుల్లో డాక్టర్‌ల కొరత లేదని, సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఉన్నారన్నారు. మందుల కొరత లేకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఆధునిక పరికాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలనందించడమే లక్ష్యంగా డాక్టర్‌లు విధులను నిర్వర్తించాలన్నారు.

అనంతరం ఆసుపత్రిలో పరిసరాలను పరిశీలించిన అక్కడున్న పరిశుభ్రతను చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని, ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని శుభ్ర పరచడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం పై ఆయన ఆసుపత్రి నిర్వహకులను అభినందించారు. అదే విధంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు ప్రభుత్వం తరపున అందించే భోజనం విషయంలో వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, నాణ్యమైన, పౌష్టికాహరం అందించే దిశగా చర్యలు తీసుకొవాలని ఆయన ఆదేశించారు. జోగిపేట ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు, పారిశుద్ద్య నిర్వహణ పై రోగులు సైతం సంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట సూపరిండెంట్‌ సౌజన్య, డాక్టర్‌లు సిద్దార్థ్, నాగలక్ష్మి, నాగరాజ్‌లతో పాటు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed