- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Aadi Srinivas: భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయం.. ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు (Telangana High Court) ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. రాజ్యాంగం (Constitution)లోని షెడ్యూల్ 10 ప్రకారం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తగిన సమయంలో నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉందని ధర్మాసనం వెల్లడించింది. అదేవిధంగా నాలుగు వారాల్లోగా అసెంబ్లీ స్పీకర్ (Assembly Speaker) నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ (Single Bench) ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ (High Court Division Bench) కొట్టివేసింది. ఈ క్రమంలోనే కోర్టు తీర్పుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేల అనర్హతపై ధర్మాసనం తీర్పు బీఆర్ఎస్ (BRS) నేతలకు చెంపపెట్టు లాంటిదని అన్నారు. తగిన సమయంలో స్పీకర్ (Speaker) నిర్ణయం తీసుకుంటారని.. నిర్ణీత సమయాన్ని కూడా కోర్టు ప్రస్తావించలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) పూర్తిగా ఖాళీ అవ్వడం ఖాయమని ఆది శ్రీనివాస్ అన్నారు.