సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట సీఐటీయూ నాయకుల ఆందోళన..

by Sumithra |
సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట సీఐటీయూ నాయకుల ఆందోళన..
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సీపీఐ అనుబంధ సంఘమైన ఎఐటీయూసీ, సీపీఎం అనుబంధ సంఘమైన సీఐటీయూ నాయకులు ఆందోళన చేపట్టారు. సింగరేణి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దాంతో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులకు, కార్మిక సంఘాల నాయకులకు మద్య తీవ్రవాగ్వివాదం చోటు చేసుకుంది.

అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇరువర్గాలకు సర్ధి చెప్పె ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వామపక్ష కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘంతో ఒకలా, వామపక్ష పార్టీలతో ఒకలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు మంచిపద్దతి కాదని ఇలానే వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయ సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుని చూసిన నాయకులు గేట్లు పగుల కొట్టే ప్రయత్నం చేశారు. అక్కడి చేరుకున్న అధికారులతో ఎంఎల్ఏ మాట్లాడి సమస్యను పరిష్కరించి ఎవ్వరికి వారు ప్రచారం నిర్వహించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed