- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కనకయ్య కొనుగోళ్ల కు... హరిప్రియ అభివృద్ధికి పోటీ
దిశ, ఇల్లందు : కనకయ్య అమ్మ కాలు, కొనుగోళ్ల కు హరిప్రియ అభివృద్ధికి జరుగుతున్న పోటీ అని ఇల్లందు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. గురువారం జేకే కాలనీ నుండి గోవింద్ సెంటర్ వరకు వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు నినాదాలతో ఇల్లందు పట్టణం గులాబీమమైంది. అనంతరం తన మద్దతుదారులతో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తహసీల్దార్ కార్యాలయం నందు నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ ప్రక్రియలో బీఆర్ఎస్ ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ బీఆర్ఎస్ గెలుపుతో ఇల్లందు చరిత్ర తిరగ రాయబోతున్నామన్నారు. నవంబర్ 1న కనీవిని ఎరుగని రీతిలో జరిగిన సీఎం ప్రజా ఆశీర్వాద సభ తో ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తుందన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో 1800 కోట్లతో అభివృద్ధి పనులు, 1177 కోట్లతో సంక్షేమ
పథకాలు అమలు చేశామన్నారు. కనకయ్య అమ్మకాలు, కొనుగోళ్లతో నాయకులు మాత్రమే పార్టీని వీడుతున్నారని, ద్వితీయ శ్రేణి నాయకులు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పట్టుదలతో ఉన్నారన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో రెండు లక్షల పదిహేను వేల మంది ఓటర్లు ఉంటే 1,72,000 మంది కేసీఆర్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను పొందారన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 48 వేల ఎకరాల పోడు భూములకు 15,372 మంది పట్టాలను పొందారన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పొందిన ప్రజలందరూ కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని, రెండవసారి ఇల్లందు ఎమ్మెల్యేగా గెలిచి ఇల్లందు చరిత్ర ను తాను తిరగరాస్తానన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండి గల రాజేందర్, జెడ్పీటీసీ వాంకుడోత్ ఉమాదేవి, వైస్ చైర్మన్ జానీ, టీబీజీకేఎస్ నాయకులు రంగనాథ్, కౌన్సిలర్లు, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.