- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA Maloth Ramdas Naik : వైరాకు సీతారామ ద్వారా గోదావరి జలాలు..
దిశ, వైరా : ఈనెల 15వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వైరాలో నిర్వహించే చారిత్రాత్మక రైతు బహిరంగ సభను రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పిలుపునిచ్చారు. వైరాలోని న్యూ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాల సమీపంలో సీఎం సభ నిర్వహించే స్థలాన్ని శనివారం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ చేపడుతున్న పనులను పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు.
అనంతరం రాందాస్ నాయక్ మాట్లాడుతూ దేశప్రజలు స్వాతంత్య్ర సంబరాలు జరుపుకునే రోజు రూ.2 లక్షల రుణమాపీతో తెలంగాణలోని రైతులు సంబరాలు జరుపుకోనుండడం ఎంతో సంతోషదాయకమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చెక్కులను అందజేస్తామని ప్రకటించారు. ఈ నెల 15న సీఎంతో నిర్వహించే సభ రాష్ట్ర చరిత్రలోనే చారిత్రాత్మకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముందుగా అశ్వాపురంలో సీఎం సీతారామ ప్రాజెక్టు పంపహౌజ్లను ప్రారంభించి గోదావరి జలాలను జాతికి అంకితం చేస్తారని వివరించారు. ప్రస్తుతం వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని 1.20 లక్షల ఎకరాలకు, కొండలు, గుట్టలు, నదులు దాటి ఖమ్మం జిల్లా భూతల్లిని గోదావరి జలాలు ముద్దాడబోతున్నాయన తెలిపారు. వైరాలో నిర్వహించే సభకు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పలువురు ఎమ్మెల్యేలు హాజరవుతారని వివరించారు.
ఈ సభకు వైరా నియోజకవర్గం నుంచి వేలాది మంది రైతులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మార్కుఫెడ్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, టీపీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కిసాన్ కేత్ రాష్ట్ర నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, నూతి సత్యనారాయణ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, నాయకులు కట్ల సంతోష్, మొక్క శేఖర్ గౌడ్, నంబూరి కనకదుర్గ, కోసూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.