- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM Revanth Reddy : రేయింబవళ్లు కష్టపడి పంప్ హౌస్‌లో నీరు పారేలా చేశాం
దిశ, ములకలపల్లి: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీతారామ కోసం ఆరు మాసాలు రేయింబవళ్ళు కష్టపడి పంప్ హౌస్ పనులు పూర్తి చేసి నీరు పారించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెంలోని సీతారామ ప్రాజెక్టుని మంత్రుల సమక్షంలో ఆయన ప్రారంభించారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. పంప్ ఆన్ చేసిన తర్వాత కాలువలో పారుతున్న గోదావరి జలాలకు పురోహితుల మంత్రోశ్ఛరణల పూజలు నిర్వహించారు. గోదావరి నీటికి పూలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇదే మండలంలో ఉన్న కమలాపురంలో మూడో పంప్ హౌస్‌ను మంత్రి భట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. పదేళ్లు అధికారంలో ఉండి అప్పటి ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు డీపీఆరే ఇవ్వలేదని.. కమీషన్ల బాగోతం బయటపడుతుందనే అలా చేయలేదని రేవంత్ ఆరోపించారు. స్వాతంత్ర దినోత్సవం నాడే ఖమ్మం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సీతారామ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని సీఎం అన్నారు.
అనంతరం జరిగిన ప్రస్ మీట్ లో రేవంత్ మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు నిధుల కోసం ఒత్తిడి చేస్తే నేను మిగతా జిల్లాల గురించి కూడా ఆలోచిస్తున్నానని. ఎన్ని ఒత్తిళ్లు ఉన్న నిధుల కేటాయింపులో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాం అన్నారు. కేసీఆర్ పది సంవత్సరాలు అధికారంలో ఉండి రూ.లక్ష 80 వేల కోట్లు ఖర్చు పెట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్, హరీష్ బోగస్ మాటలు చెబుతారు, ఆ పార్టీ నేతలు నీళ్ళ కోసం ఆందోళన చేయలేదని, నాగార్జున సాగర్ నీళ్లు రాకపోయినా గోదావరి జలాలతో సాగర్ ఆయకట్టు కోసం వైరా లింక్ కెనాల్ చేపట్టాం అన్నారు. లింక్ కెనాల్ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ వెంటపడి చేపించాం మన్నారు. కార్యక్రమంలో సీఎస్ శాంతకుమారి, నీటిపారుదల కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఎంపీ రఘురామ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయబాబు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు.