- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫ్లెక్సీల్లో తప్పుగా సీఎం ఇంటి పేరు..
దిశ, వైరా : స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వైరాలో గురువారం నిర్వహించే రైతు సదస్సులో రూ.2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తప్పులు దొర్లాయి. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కి స్వాగతం పలుకుతూ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు వైరాలోని జాతీయ రహదారి పక్కన పలు ప్రధాన ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి పేరును తప్పుగా ముద్రించారు. ఇది గమనించకుండానే తప్పుగా ముద్రించిన ఫ్లెక్సీలను వైరాలోని ప్రధాన సెంటర్లలో ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి పేరు ఎనుముల బదులు ఈ ఫ్లెక్సీల్లో అనుముల అని ముద్రించారు. ఈ ఫ్లెక్సీలను చూసిన వారంతా ముఖ్యమంత్రి ఇంటి పేరు తప్పుగా ప్రచురించారిని చర్చించుకుంటున్నారు.