Bonalu : జూలూరుపాడులో ఘనంగా బోనాల జాతర

by Sridhar Babu |
Bonalu : జూలూరుపాడులో ఘనంగా బోనాల జాతర
X

దిశ, జూలూరుపాడు : జూలూరుపాడులో మహిళలు ఆషాఢం బోనాలను మైసమ్మ అమ్మవారికి ఘనంగా సమర్పించారు. స్థానిక రామాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడ నుంచి బోనాలను ఎత్తుకొని ఆటపాటలతో డప్పు వాయిద్యాలతో కుటుంబ సభ్యులందరూ

సంతోషంగా పాల్గొని గ్రామ పొలిమేరలో ఉన్న కోట మైసమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం బోనాలు సమర్పించారు. మొక్కులు చెల్లించారు. వర్షాలు బాగా పండి పాడిపంటలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయం వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Next Story