ఇద్దరి ప్రాణాలు కాపాడిన బ్లూ కోర్టు కానిస్టేబుల్

by Anjali |
ఇద్దరి ప్రాణాలు కాపాడిన బ్లూ కోర్టు కానిస్టేబుల్
X

దిశ, కూసుమంచి: పాలేరు జలాశయంలో రెండేళ్ల కూతురుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడేందుకు యత్నించిన ఆటో డ్రైవర్ ను కూసుమంచి పోలీస్ స్టేషన్ కు చెందిన బ్లూ కోర్టు కానిస్టేబుల్ బ్రహ్మం కాపాడాడు. జీళ్లచెరువుకి చెందిన జంపాల నరేష్ అతని భార్య గొడవ పడ్డారు. ఈ క్రమంలో మనస్థాపానికి గురై పాలేరు జలాశయంలో ఆత్మహత్య చేసుకునేందుకు తన కూతురితో ఆటోలో వెళ్లి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా 100 నెంబర్‌కు డయల్ చేసి చెప్పాడు. దీంతో స్పందించిన బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ బ్రహ్మం అక్కడికి వెళ్లి అప్పటికే షర్టును చింపి రాళ్లు కట్టి రిజర్వాయర్లో దూకేందుకు ప్రయత్నిస్తూ ఉండగా వెంటనే కాపాడి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించాడు.

Advertisement

Next Story

Most Viewed