Godavari floods: భద్రాద్రి ఏజెన్సీ గోదావరి ఉగ్రరూపం.. స్తంభించిన రవాణా

by Mahesh |
Godavari floods: భద్రాద్రి ఏజెన్సీ గోదావరి ఉగ్రరూపం.. స్తంభించిన రవాణా
X

దిశ, భద్రాచలం: భద్రాద్రి వద్ద గోదావరి పెరుగుతూ వస్తుంది. శుక్రవారం రాత్రి 9 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి 48 అడుగులకు చేరుకోవడంతో వారం రోజుల వ్యవధిలో మూడోసారి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. క్రమంగా పెరుగుతూ, శనివారం ఉదయం 10 గంటలకు 51.8 అడుగులకు చేరుకొని మూడవ ప్రమాద హెచ్చరికకు చేరువగా ప్రవహిస్తుంది. గోదావరి 50 అడుగులు దాటి ప్రవహించడంతో ప్రధాన రహదారులపై నీరు చేరుకోవడం కారణంగా భద్రాద్రి ఏజెన్సీ‌లోని అన్ని మండలాలకు రవాణా స్థంభించింది. దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద రహదారిపై గోదావరి ప్రవహించడం కారణంగా భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పవిత్ర పుణ్యక్షేత్రం పర్ణశాల వెళ్లే రహదారి మూసుకొని పోయింది. వెంకటాపురం మండలంలో ఆలుబాక, పాత్రాపురం వద్ద రహదారిపై గోదావరి ప్రవహిస్తుంది. బూర్గంపాడు మండలం సారపాక నుండి రెడ్డిపాలెం వెళ్లే దారి పైకి గోదావరి చేరుకోవడం కారణంగా, ఆ దారిలో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్రం నుంచి చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు వెళ్లే రహదారుల పైకి నీరు రావడంతో తెలంగాణ నుంచి ఆ రాష్ట్రాలకు రాకపోకలు స్తంభించాయి.



Next Story