- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలగడ్డ నుంచి మహారాష్ట్రకు గంజాయి సప్లై చేస్తున్న ముఠా అరెస్టు
దిశ, భద్రాచలం : భద్రాచలం పోలీసులు రూ.4 లక్షల విలువైన 20కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఏఎస్‌పీ బి.రోహిత్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 6 గంటలకు ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర భద్రాచలం పట్టణ సీఐ స్వామి ఆధ్వర్యంలో ఎస్ఐ మధు తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అప్పుడు ఏపీ 20 టీఏ నెంబర్ ఆటోలో ఉన్న నలుగురు, ఏపీ 16 ఏఈ 1622 నంబర్ మోటార్ సైకిల్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తూ కనిపించడంతో వారిని ఆపి తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో 20కేజీల గంజాయి లభ్యమైందని వారు తెలిపారు. దాని విలువ సుమారు రూ.4 లక్షలని తెలిపారు. గంజాయి రవాణా చేస్తున్న బాదావత్ కృష్ణ (మరిపెడ బంగ్లా), సారపాకకి చెందిన బాణోత్ తరుణ్, నారగొని సాయి యాదవ్, నునావత్ రాజు, చల్ల ఉపేంద్ర, గోల్లోరి సురేష్ అనే వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పాలగడ్డ నుండి మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్నట్లు నింధితులు అంగీకరించారని ఏఎస్‌పీ చెప్పారు. విలేకర్ల సమావేశంలో సీఐ స్వామి, ఎస్ఐ మధు పాల్గొన్నారు.