- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా రాజీనామా చేయాలి
దిశ, భద్రాచలం టౌన్ : భారత పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రజలకు క్షమాపణ చెప్పాలని, తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి డిమాండ్ చేశారు. సీపీఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డా.బీఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును అనేకసార్లు సంబోధించాల్సిన అవసరం లేదని, దానికి బదులు దేవుడిని తలుచుకుంటే స్వర్గం ప్రాప్తి లభిస్తుందని కించపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షా ను దేశం క్షమించదని అన్నారు.
ఆర్ఎస్ఎస్ మతోన్మాదశక్తి దేశంలో బీజేపీని నడిపిస్తుందని, రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తుందని వారు దుయ్యబట్టారు. దేశంలో బడుగు, బలహీన వర్గాలు ఆరాదించే దైవం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, అట్లాంటి భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించడం దారుణమైన చర్యని అన్నారు. అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు సున్నం గంగా, డి.సీతాలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి, ఉస్తేల జ్యోతి, రాఘవయ్య, చాట్ల శ్రీను, జీవనజ్యోతి, అజయ్ కుమార్, కోరాడ శ్రీనివాస్, ఎస్డీ ఫిరోజ్, ఏ.జె.గౌతమి, మచ్చ రమాదేవి, కనక శ్రీ, శాఖ కార్యదర్శులు ఝాన్సీ, ధనలక్ష్మి, రామకృష్ణ, రాధా, ఆదినారాయణ పాల్గొన్నారు.