Ponnam Prabhakar: రాహుల్ గాంధీ క్యారెక్టర్‌ను దెబ్బతీసే కుట్ర

by Gantepaka Srikanth |
Ponnam Prabhakar: రాహుల్ గాంధీ క్యారెక్టర్‌ను దెబ్బతీసే కుట్ర
X

దిశ, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై నేరస్థుడు అనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ(BJP) విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ప్రకటించారు. శుక్రవారం శాసన మండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు అత్యున్నత వ్యవస్థ అని అన్నారు. పార్లమెంటులోకి ప్రవేశించే ద్వారం దగ్గర ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులను లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సహా ఇతర నాయకులను పార్లమెంటు లోపలికి వెళ్లకుండా దారికి అడ్డం నిల్చొని నిరోధించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వారిని పక్కకు జరుపుకుంటూ పార్లమెంటు(Parliament) లోపలికి వెళ్లే సందర్భంలో పక్కనున్న పార్లమెంటు సభ్యుడు కాకుండా తరువాత ఉన్న సభ్యుడు కింద పడి చిన్న దెబ్బ తాకితే దానిపైన బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. రాహుల్ గాంధీ క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

రాహుల్ గాంధీ నేరస్తుడు అనే భావన తెచ్చే విధంగా హత్యా ప్రయత్నం కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చకు వేదికగా ఉండే పార్లమెంట్‌లో ద్వారం దగ్గరే అడ్డుకుంటున్నారంటే వారి కుట్రలు అరాచకం, నియంతృత్వం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌(Ambedkar)ను అమిత్ షా(Amit Shah) అవమాన పరిస్తే ప్రధాని(PM Modi) మౌనంగా ఉండటమే కాకుండా.. రాహుల్ గాంధీ నోరు మూయించే ప్రయత్నం చేయడం దారుణమని అన్నారు. రాహుల్ గాంధీపై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని.. అంబేద్కర్‌ను అవమానపరిచిన అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed