- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పక్కా కమర్షిల్ ‘క్లబ్’గా మారిన స్పోర్ట్స్ క్లబ్.. రూ.లక్షల్లో దోపిడీ
స్పోర్ట్స్ క్లబ్ పేరిట సొసైటీగా ఏర్పడి సింగరేణి స్థలంలో ఏర్పాటు చేసిన కొత్తగూడెం క్లబ్‌ను పూర్తిగా కమర్షియల్‌గా మార్చేసి శుభకార్యాలు, పెళ్లిళ్లకు కిరాయిలకు ఇస్తున్నారు. శుభకార్యాల కోసం క్లబ్ బుక్ చేసుకున్న ప్రజలకు.. నిర్వాహకులు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తున్నది. క్లబ్‌కు చెల్లించే కిరాయితో పాటు అదనపు దోపిడీ చేస్తున్నట్లు అనేకమంది వాపోతున్నారు. క్లబ్‌లో ఏ ప్రోగ్రాం జరగాలన్నా.. డెకరేషన్, టెంట్ హౌస్, వంటలు వండేవారు, పాలు ఇస్తరాకుల వరకు అన్ని వారు చెప్పిన వారితోనే చేయించుకోవాలి. బయటి వారికి ఏమాత్రం అవకాశం ఉండదు. సరే కదా అని ఒక అడుగు ముందుకు వేస్తే రూ.లక్షలు దండుకుంటున్నారని బాధితులు చెబుతున్నారు. నిర్వహకులు డెకరేషన్, టెంట్ హౌస్, వంటల వరకు ప్రతి ఒక్కరి వద్ద కమీషన్లు వసూలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. సొసైటీలో సుమారు 150 మంది సభ్యులు ఉన్నప్పటికీ కొత్తగూడెం క్లబ్ ఆదాయం, వ్యయం వంటి వివరాలు ఎవరికి తెలియడం లేదు. ప్రతి రెండేళ్లకు సొసైటీ ఎన్నిక జరగాల్సి ఉండగా.. ఒకే సామాజిక వర్గానికి చెందిన కొంతమంది పెద్దలు ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తున్నారని, వేరే సామాజికవర్గానికి అవకాశాలు కల్పించడం లేదని చర్చించుకుంటున్నారు. - దిశ ప్రతినిధి, కొత్తగూడెం
దిశ ప్రతినిధి, కొత్తగూడెం: పెళ్లయినా, పురుడైన మరే ఇతర శుభకార్యమైన జీవితంలో ఒకసారె జరుపుకుంటాం ఆ మధురమైన జ్ఞాపకాలను జీవితాంతం నెమరి వేసుకోవచ్చు అన్న సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆలోచన కొంతమంది బడా బాబులకు రూ.కోట్లు కురిపిస్తున్నాయి. ఇంట్లో జరగబోయే శుభకార్యాన్ని కనుల పండుగగా జరుపుకోవడానికి స్తోమతకు మించి అప్పులు చేసి క్లబుల్లో అడుగుపెడుతున్న ప్రజలకు చుక్కలు చూపుతున్నారు నిర్వహకులు. అలాంటి పరిస్థితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం క్లబ్లో తారసపడుతోంది.
రూ.లక్షల దోపిడీ..
పెళ్లిళ్లు శుభకార్యాలు జరపదలచిన ప్రజలకు సువిశాలంగా కనబడే ఫంక్షన్ హాల్ లేదా క్లబ్బులను వెతుకుతున్న ప్రజలకు కొత్తగూడెం క్లబ్ బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తుంది. తప్పదని లోపలికి వెళ్లిన ప్రజలు లక్షల్లో సమర్పించాల్సిందే. స్పోర్ట్స్ క్లబ్ పేరిట సొసైటీగా ఏర్పడి సింగరేణి స్థలాన్ని చేజిక్కించుకొని కొంతకాలం బాలోత్సవ్ లాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఎలాంటి ఆటపాటలకు తావు లేకుండా క్లబ్బును కమర్షియల్‌గా మార్చేశారు. అంతేగాక క్లబ్బులో ఏ కార్యక్రమం జరిగినా సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో పక్కనే ఉన్న ఆర్డీఓ ఆఫీస్ స్థలాన్ని, రోడ్డును పార్కింగ్ కోసం వాడుకుంటున్నారు. అనేక సందర్భాల్లో క్లబ్‌లో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యే ప్రజలు కార్లు ద్విచక్ర వాహనాలు రోడ్డుకు ఇరువైపులా ఆపి ఉంచడంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అంతా కమీషన్ల మయం..
ఈ క్లబ్బులో శుభకార్యాలు జరపదలచిన ప్రజలకు క్లబ్బుకు చెల్లించే కిరాయితోపాటు అదనపు దోపిడీకి గురవుతున్నామని అనేకమంది వాపోతున్నారు. క్లబ్‌లో ఏ కార్యక్రమం జరగాలన్నా డెకరేషన్, టెంట్ హౌస్, వంటలు వండేవారు, పాలు ఇస్తరాకుల వరకు అన్నీ వీరు చెప్పిన వారితోనే చేయించుకోవాలి.. బయటి వారికి ఏమాత్రం అవకాశం ఉండదు. సరే కదా అని ఒక అడుగు ముందుకు వేస్తే లక్షల రూపాయలు దండుకుంటున్నారని బాధితులు అంటున్నారు. డెకరేషన్, టెంట్ హౌస్, వంటల వరకు ప్రతి ఒక్కరి వద్ద కమీషన్లు వసూలు చేస్తున్నారని పట్టణంలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ కమీషన్లు వసూలు చేయనట్లయితే బయటి వారికి ఎందుకు అవకాశం ఇవ్వరని అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పెద్దల ఆధిపత్యం
స్పోర్ట్స్ క్లబ్ పేరిట సొసైటీగా ఏర్పడి సింగరేణి స్థలాన్ని పొంది కొంతకాలం ఆటపాటలకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ గత కొన్నేళ్లుగా కేవలం కమర్షియల్‌గానే వ్యవహరిస్తున్నారు. ప్రతి ఏటా క్లబ్బుకు వచ్చిన ఆదాయం ఎంత? ఎవరు ఆడిటింగ్ చేస్తున్నారు? వచ్చిన ఆదాయాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారు అన్న ప్రశ్నలకు ఎటువంటి సమాధానం దొరకదనే వాదనలు వినిపిస్తున్నాయి. సొసైటీలో సుమారు 150మంది సభ్యులు ఉన్నప్పటికీ కొత్తగూడెం క్లబ్ రహస్యాలు అనేకమందికి అంతుచికడం లేదని ప్రచారం సాగుతోంది.
ప్రతి రెండేళ్లకు సొసైటీ ఎన్నిక జరగాల్సి ఉండగా ఒకే సామాజిక వర్గానికి చెందిన కొంతమంది పెద్దలు ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తున్నారని, వేరే సామాజిక వర్గానికి అవకాశాలు కల్పించడం లేదని చర్చించుకుంటున్నారు. ఏదేమైనా శుభకార్యాలకు అడుగుపెట్టే సామాన్యు, మధ్య తరగతి ప్రజలకు క్లబ్ కిరాయితోపాటు డెకరేషన్, టెంట్ హౌస్, వంటలు, పాలు, విస్తర్లు అని ప్రతి అవసరానికి కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.