నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన భవనం సీజ్

by Sridhar Babu |
నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన భవనం సీజ్
X

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మంలో నిబంధనలు అతిక్రమించిన భవనంను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. ప్రముఖ ఆసుపత్రి యజమాని రెండు అంతస్తులు అనుమతులు తీసుకొని ఐదు అంతస్తుల భవనం నిర్మించాడు. దాంతో మున్సిపల్ కమిషనర్ ఆదేశాల ప్రకారం టౌన్ ప్లానింగ్ అధికారిణి ఏసీపీ వసుంధర ఆధ్వర్యంలో గురువారం భవనాన్ని సీజ్ చేశారు. మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయి అని అధికారులు హెచ్చరించారు.

Advertisement

Next Story