- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమ్మినేని కృష్ణయ్య హత్యపై స్పందించిన ఖమ్మం CPM
దిశ ఖమ్మం టౌన్: ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య హత్యను సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, హత్యకు పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరారు. ఈ ఘటనను సాకుగా తీసుకొని, దీనితో సంబంధం లేని మా పార్టీ నాయకుడు తమ్మినేని కోటేశ్వరరావుతో సహా మరికొందరు పార్టీ సభ్యుల, సానుభూతిపరుల ఇండ్లపై దాడులు చేసి, విధ్వంసం సృష్టించి మహిళలను, వృద్ధులను భయభ్రాంతులకు గురిచేయడాన్నీ తీవ్రంగా ఖండించారు. లక్షలాది రూపాయల ఆస్తులు ధ్వంసం చేయడమే కాకుండా, కొందరు లూటీలకు కూడా పాల్పడ్డారని అన్నారు. దాదాపు మూడు గంటల పాటు అరాచక మూకలు పోలీసుల ముందే బీభత్సం చేసినా అదుపు చేయకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ విధ్వంసానికి కారకులైన అరాచక శక్తులపై చర్యలు తీసుకొని గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలని జిల్లా అధికారులను కోరారు.
హంతకులకు మాజీ మంత్రి తుమ్మల వార్నింగ్.. కృష్ణయ్య కుటుంబానికి భరోసా