- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమ్మినేని హెల్త్ కండీషన్‌పై CPM నేతల కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: గుండె పోటుకు గురైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఆ పార్టీకి చెందిన నేతలు కీలక ప్రకటన చేశారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. ఆయన హెల్త్ కండీషన్‌పై ఎలాంటి ఆందోళన చెందొద్దని సూచించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందుతోందని తెలిపారు. తమ్మినేనిని పరామర్శించేందుకు పార్టీ కార్యకర్తలు దయచేసి ఆసుపత్రికి రావొద్దని ఈ సందర్భంగా నేతలు విజ్ఞప్తి చేశారు. కాగా, ఇవాళ ఖమ్మంలోని తన నివాసంలో తమ్మినేని గుండె పోటుకు గురయ్యారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆయన హైదరాబాద్ తరలించారు.
గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. తమ్మినేని ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు పేర్కొన్నారు. రెండు, మూడు రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. గుండె పోటుకు గురై ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న తమ్మినేని వీరభద్రాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ్మినేని కుటుంబ సభ్యులతో మాట్లాడి హెల్త్ కండీషన్ గురించి తెలుసుకున్నారు.