TGTA: త‌హ‌శీల్దార్ల స‌మ‌స్యల‌ను వెంట‌నే ప‌రిష్కరించాలి

by Gantepaka Srikanth |
TGTA: త‌హ‌శీల్దార్ల స‌మ‌స్యల‌ను వెంట‌నే ప‌రిష్కరించాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏండ్ల త‌ర‌బ‌డి పెండింగ్‌లో ఉన్న త‌హ‌శీల్దార్ల స‌మ‌స్యల‌ను వెంట‌నే ప‌రిష్కరించాలని తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేషన్‌(TGTA) రాష్ట్ర అధ్యక్ష కార్యద‌ర్శులు ఎస్‌.రాములు, ర‌మేష్ పాక ప్రభుత్వాన్ని కోరారు. త‌హ‌శీల్దార్లకు డిప్యూటీ క‌లెక్టర్‌గా ప‌దోన్నతుల‌ను క‌ల్పించాల‌న్నారు. ఇటీవ‌ల రెవెన్యూ అధికారుల‌పై జ‌రుగుతున్న దాడుల‌ ఘటనలపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌న్నారు. స్పెష‌ల్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్టర్ల నుంచి 33 సెల‌క్షన్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్టర్‌గా పోస్టుల‌ను అప్‌ గ్రేడ్ చేయడం ప‌ట్ల సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, సీసీఎల్ఏ న‌వీన్ మిట్టల్‌కు ప్రత్యేకంగా ధ‌న్యవాదాలు తెలిపారు. సీనియ‌ర్ అసిస్టెంట్లకు డిప్యూటీ త‌హ‌శీల్దార్లుగా ప‌దోన్నతి క‌ల్పించ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్యక్తం చేశారు.

చార్మినార్ జోన్‌లో ఆపిన ఇదే ప‌దోన్నతుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ తహ‌శీల్దార్స్ అసోసియేష‌న్‌(టీజీటీఏ) రాష్ట్ర కార్యవ‌ర్గ స‌మావేశం సీసీఎల్ఏ కార్యాల‌యం ప్రాంగ‌ణంలోని కార్యాల‌యంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి పర్యవేక్షణలో శనివారం జ‌రిగింది. ఈ స‌మావేశానికి టీజీటీఏ కార్యవ‌ర్గంతో పాటు అన్ని జిల్లాల నుంచి అసోసియేష‌న్ ప్రతినిధులు హాజ‌ర‌య్యారు. స‌మావేశంలో తీర్మానించిన అంశాల‌ను అసోసియేష‌న్ అధ్యక్ష కార్యద‌ర్శులు ఎస్‌.రాములు, ర‌మేష్ పాక‌, సెక్రట‌రీ జ‌న‌ర‌ల్ ఫూల్‌సింగ్ చౌహాన్‌, కోశాధికారి శ్రీ‌నివాస్‌ శంక‌ర్‌రావు, మ‌హిళా విభాగం అధ్యక్షురాలు రాధలు మీడియాకు వివరించారు.

తీర్మానాలు

- ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌హ‌శీల్దార్లను బ‌దిలీలు చేశారు. కానీ నేటికి వారిని సొంత జిల్లాల‌కు బ‌దిలీ చేయలేదు. వెంట‌నే వారిని సొంత జిల్లాల‌కు బ‌దిలీ చేయాలి.

- పెండింగ్‌లో ఉన్న వాహ‌నాల అద్దె బిల్లుల‌ను వెంట‌నే చెల్లించాలి.

- అద్దె వాహ‌నాలకు చెల్లించే మొత్తాన్ని నెల‌కు రూ.33 వేల నుంచి రూ.50 వేల‌కు పెంచాలి.

- రెవెన్యూ అధికారుల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాలి. దాడులు పున‌రావృతం కాకుండా చ‌ర్యలు చేప‌ట్టాలి.

- చిన్న చిన్న స‌మ‌స్యల‌కు త‌హ‌శీల్దార్లు/ ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్‌ల‌పై అకార‌ణంగా కేసుల న‌మోదు చేయ‌కుండా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి.

– పెండింగ్‌లో ఉన్న త‌హ‌శీల్దార్ నుంచి డిప్యూటీ క‌లెక్టర్లుగా ప‌దోన్నతుల ప్రక్రియ‌ను వేగ‌వంతం చేయాలి.

Advertisement

Next Story

Most Viewed