సంస్థాగత ఎన్నికలపై ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల కీలక చర్చ

by Bhoopathi Nagaiah |
సంస్థాగత ఎన్నికలపై ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల కీలక చర్చ
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ సంస్థాగత ఎన్నికలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. కాగా ఈ సమావేశానికి ప్రధాని మోడీ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలకు సంస్థాగత ఎన్నికలపై హైకమాండ్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ప్రక్రియ ఎంతమేరకు పూర్తయిందనే అంశాలపై అధిష్టానం ఆరా తీసినట్లు సమాచారం. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించినట్లు తెలిసింది. సంస్థాగత ఎన్నికలతో పాటు పార్టీ కార్యక్రమాలు, పార్టీని బలోపేతం చేయడంపై చర్చించినట్లు తెలిసింది. ఇదిలాఉండగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తయితే కొత్త అధ్యక్షుడి నియామకం జరగనుంది. కాగా ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరయ్యారు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన నేషనల్ ఆఫీస్ బేరర్లు, ఆయా రాష్ట్రాల ఇన్ చార్జీలు మీటింగ్ కు వచ్చారు.

Advertisement

Next Story

Most Viewed