Kishan Reddy: ప్రపంచాన్ని శాసించే దిశగా ప్రధాని మోడీ అడుగులు

by Gantepaka Srikanth |
Kishan Reddy: ప్రపంచాన్ని శాసించే దిశగా ప్రధాని మోడీ అడుగులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ శాఖ(Department of Central Govt)ల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఖాళీగా ఉంచకుండా భర్తీ చేయాలనేదే ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Modi) లక్ష్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రకటించారు. రోజ్ గార్ మేళా ద్వారా ఇప్పటి వరకు 8.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని ఆయన వెల్లడించారు. సోమవారం బషీర్ బాగ్‌లోని భారతీయ విద్యా భవన్‌లో తెలంగాణ తపాలా శాఖ ఆధ్వర్యంలో జరిగిన రోజ్‌గార్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) హాజరయ్యారు. రోజ్‌గార్ మేళాలో భారత ఆహార సంస్థ, సీబీఐటీ, ఆదాయపు పన్ను శాఖ, తపాలా శాఖ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎయిమ్స్, రైల్వే తదితర శాఖలలో ఉద్యోగాలకు ఎంపికైన 154 మందికి కేంద్ర మంత్రి నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి(Kishan Reddy) మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా సోమవారం ఒక్క రోజే 51 వేల మంది కేంద్ర ఉద్యోగాలు పొందుతున్నారని ప్రకటించారు. వచ్చిన ఉద్యోగం ఏదైనా.. దృష్టి పెట్టి, ఆత్మవిశ్వాసంతో యువత పని చేయాలంటూ ఆయన సూచించారు. దేశంలో నేటికీ రోజ్ గార్ మేళ కింద 8.50 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించామని ఆయన వెల్లడించారు. దేశంలో మొత్తం 12 లక్షల ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉపాధి కల్పనకు, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు విద్య, వైద్యం, రక్షణ, పరిశోధన వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను భారత ప్రభుత్వం పెద్దఎత్తున ఆహ్వానిస్తోందని కేంద్రమంత్రి చెప్పారు. ఈ పెట్టుబడులు ఉద్యోగావకాశాలను పెంచడమే కాకుండా దేశమౌలిక సదుపాయాలు, నైపుణ్య, ఆవిష్కరణల సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచాన్ని శాసించే దిశగా ప్రధాని మోడీ అడుగులు వేస్తున్నారని, ప్రపంచం భారత్ వైపు చూస్తోందని, వికసిత భారత్ లక్ష్యంతో దేశం అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్నదే మోడీ లక్ష్యమన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయ్యే 2047 నాటికి వికసిత్ భారత్- అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. దేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కీలకంగా ఉండాలన్నదే మోడీ ప్రధాన ఎజెండా కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

మోడీ పాలనలో దేశంలో ఎక్కడ ఉగ్రవాద చర్యలు లేవని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచి వేశామని కిషన్ రెడ్డి ప్రకటించారు. దేశంలో విద్యుత్ కొరత లేకుండా నరేంద్ర మోడీ నూతన భారతాన్ని ఆవిష్కరించారంటూ కిషన్ రెడ్డి తెలిపారు. టాయిలెట్ నుంచి చంద్రయాన్ వరకు దేశంలో సంపూర్ణ మార్పు కనిపిస్తోందని, వచ్చే 25 ఏళ్లు దేశానికి అమృత్ కాలం అని, యువత పవర్ దేశానికి చాలా వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని యువత మన దేశంలో ఉందని, యువత దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలంటూ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సోషల్ మీడియా, కొరియర్ లు వచ్చిన తరువాత పోస్ట్ ఆఫీసులు మూత పడే ప్రమాదంలో పడ్డాయని, మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత పోస్ట్ ఆఫీస్ లను బ్యాంక్ రూపంలో అభివృద్ధి చేశామన్నారు. ప్రధాని పని రాక్షసుడని, ఎప్పుడు దేశ అభివృద్ధి కోసమే పరితపిస్తుంటారని, ఒక్క రోజు సెలువు లేకుండా 365 రోజులు పని చేసే ఏకైక ప్రధాని మోడీ అన్నారు. ప్రతి దీపావళికి ప్రధాని ఆర్మీ జవాన్లుతో గడుపుతారని, ప్రధాని పిలుపు మేరకు తాను దేశ సరిహదుల్లో జవాన్లతో గడిపేందుకు సరిహద్దు ప్రాంతానికి వెళ్తున్నానని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed