జూపల్లితో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-21 08:48:48.0  )
జూపల్లితో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరగాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం జూపల్లి ఇంటికి ఎంపీ కోమటిరెడ్డితో వెళ్లిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోకి జూపల్లిని ఆహ్వానించామన్నారు. తమ ప్రతిపాదనకు జూపల్లి సానుకూలంగా స్పందించారన్నారు. తెలంగాణ కోసం జూపల్లి పోరాడారన్నారు. జాతీయ నేతల సమక్షంలో జూపల్లి పార్టీలో చేరతారన్నారు.

ఈ చేరికలు సామాన్యమైనవి కావన్నారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా చాలా మంది నిరసన గళం విప్పుతున్నారన్నారు. మంచి రోజు చూసి పార్టీలో జూపల్లిని చేర్చుకుంటామన్నారు. పెద్దలంతా కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతారని సంపూర్ణ విశ్వాసముందన్నారు. 15 లోక్ సభ స్థానాలు గెలిపించడమే లక్ష్యమన్నారు. అనుభవాన్ని బట్టి కాంగ్రెస్ అవకాశాలు ఇస్తుందన్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటికి కూడా వెళ్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు వెనుకబడిన జిల్లా అన్నారు. జూపల్లి రాకతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 స్థానాలు గెలుస్తామన్నారు. జూపల్లిని పార్టీలో మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు.

జూపల్లి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ది దుర్మార్గ పాలన అన్నారు. ప్రజాస్వామ్యం పాతళానికి వెళ్లిందన్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకించిన వారిని బీఆర్ఎస్ నేతలు హింసిస్తున్నారన్నారు. కేసీఆర్ రూలింగ్ లో పాలన అవినీతి మయం అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తనను సాదరంగా ఆహ్వానించిందన్నారు. బీఆర్ఎస్ ది దుర్మార్గమైన, నియంతృత్వ పాలన అన్నారు. బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టేందుకు అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ స్కీంలన్నీ ప్రజలను మభ్యపెట్టేవని ఫైర్ అయ్యారు.

Also Read..

పార్టీలో చేరికలపై ‘నో’ ఇన్టిమేషన్.. రేవంత్‌పై ఉత్తమ్ సీరియస్

Advertisement

Next Story

Most Viewed