- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేడిగడ్డ నిలబడింది.. కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కాంగ్రెస్ ప్రయత్నం: కేటీఆర్
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలనకు బయలుదేరింది. ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్‌లోని లోయర్ మానేర్ డ్యామ్‌ను బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వర్షాలకు వచ్చిన 10 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుని మేడిగడ్డ బ్యారేజీ బలంగా నిలబడిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వందల టీఎంసీల నీరు వృథాగా పోతోందని.. ఇకనైనా కాళేశ్వరంలో పంపింగ్‌ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి మేడిగడ్డ మరమ్మత్తు పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని కోరారు. రాజకీయ కక్షతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.